UAE Govt One Year Paid Leaves : ఏదాడి పాటు జీతంతో కూడిన సెలవులు’ ఉద్యోగులకు ప్రభుత్వ బంపరాఫర్

ఓ పక్క ఉద్యోగం..మరోపక్క వ్యాపారం చేయాలనుకునే..చేస్తున్న ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపారం చేయాలని ఆశ, ఆకాంక్ష ఉన్నవారు వ్యాపార బాధ్యతల్లో పడి డ్యూటీలకు సరిగా వెళ్లకపోతే ఉద్యోగం పోతుందనే టెన్షన్ ను తప్పించింది. ఏడాదిపాటు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది.

UAE Govt One Year Paid Leaves : ఏదాడి పాటు జీతంతో కూడిన సెలవులు’ ఉద్యోగులకు ప్రభుత్వ  బంపరాఫర్

UAE Govt One Year Paid Leaves

Updated On : December 30, 2022 / 3:39 PM IST

UAE Govt One Year Paid Leaves : ఓ పక్క ఉద్యోగం..మరోపక్క వ్యాపారం చేయాలనుకునే..చేస్తున్న ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపారం చేయాలని ఆశ, ఆకాంక్ష ఉన్నవారు వ్యాపార బాధ్యతల్లో పడి డ్యూటీలకు సరిగా వెళ్లకపోతే ఉద్యోగం పోతుందనే టెన్షన్ ను తప్పించింది. వ్యాపార లావాదేవీల్లో పడి ఉద్యోగాలకు సెలవులు పెడితే జీతం కట్ అవుతుందనే బాధ లేకుండా చేసింది ప్రభుత్వం. వ్యాపారం చూసుకుంటూ ఉద్యోగం కూడా చేస్తూన్నవారిని ప్రోత్సహిస్తూ యూఏఈ ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఓ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగం చేసుకుంటునే మీ వ్యాపారాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చని ప్రోత్సహించటానికి జీతంతో కూడిన సెలవును ప్రకటింది.అదికూడా ఏడాది సమయం ఇచ్చింది. ఇది సాధారణ విషయం కాదు. అటు ఉద్యోగం పోతుందనే బెంగ లేకుండా వ్యాపారం చేసుకోవటానికి ఇది సరైన అవకాశం అని దాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రోత్సహిచింది ప్రభుత్వ ఉద్యోగులకు. దాని కోసం ఏడాది సెలవు తీసుకుంటే జీతం కట్ చేయకుండా ‘సగం జీతం’ ఇస్తామని ప్రకటించింది.

ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశమనే చెప్పాలి. వ్యాపారంలో విజయవంతమైతే సరే.. లేదా తిరిగి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండనే ఉంది ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంతో. ఉద్యోగులు సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం కూడా ఇస్తామని యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. యూఏఈ అందిస్తున్న వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా యువతను ప్రోత్సహించడమే ఈ పాలసీ లక్ష్యమని షేక్ మహమ్మద్ తెలిపారు. ఈ సెలవుల అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే ఉద్యోగులు వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రశంసలు కురిపిస్తూ..ఇటువంటి నిర్ణయం అవకాశం ఇచ్చే దేశం ఒక్క యూఏఈ మాత్రమేనని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని పేర్కొంది.