UK COVID Infections: డేంజర్ బెల్స్..! యూకేలో రోజుకు లక్షా 6వేల కోవిడ్ ఇన్ఫెక్షన్లు
యూకేలో తొలిసారి లక్షా 6వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఎప్పుడూ లేనంతగా బుధవారం ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.

Boris Johnson Holds Coronavirus Press Conference Announcing Socialising Restrictions
UK COVID Infections: యూకేలో తొలిసారి లక్షా 6వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఎప్పుడూ లేనంతగా బుధవారం ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఏడు రోజులుగా 6లక్షల 43వేల 219 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి సమయంలో బ్రిటన్ లో ఈ పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో అక్కడ 140 మరణాలు సంభవించాయి.
నేషనల్ హెల్త్ సర్వీస్, కేర్ స్టాఫ్ ఎక్స్‌టార్డినరీ సేవలు అందజేయగలుగుతున్నారని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. క్రిస్ట్‌మస్ సమయంలోనూ కోవిడ్ టీకాల వేగం తగ్గకూడదని సూచించారు. ఇన్ఫెక్షన్ గురించి భయపడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు పండుగను ఎంజాయ్ చేయాలని చెప్పారు.
……………………………….: గెలుపే లక్ష్యంగా మోదీ సుడిగాలి పర్యటనలు
‘కోవిడ్ డేటా మీద ఓ కన్నేసి ఉంచుతాం. జాగ్రత్తగా ఉండండి. గైడెన్స్ ఫాలో అవండి. బూస్టర్ డోసులు వేయించుకోండి’ అని మంగళవారం చేసిన ట్వీట్ లో తెలిపారు బ్రిటన్ ప్రధాని. ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్న క్రమంలో పౌరులంతా జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడి మంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
………………………………………: నేటి నుంచి సీఎం జగన్ కడప జిల్లా పర్యటన