PM Modi: గెలుపే లక్ష్యంగా మోదీ సుడిగాలి పర్యటనలు

యూపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే పలుమార్లు యూపీలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన... గురువారం మరోసారి యూపీ..

PM Modi: గెలుపే లక్ష్యంగా మోదీ సుడిగాలి పర్యటనలు

Modi (2)

PM Modi: యూపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే పలుమార్లు యూపీలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన… గురువారం మరోసారి ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా పూర్వాంచల్‌లో అమూల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించి యూపీలోని లక్షా 74వేల మంది పాల ఉత్పత్తిదారులకు 3వేల 519 కోట్ల రూపాయల బోనస్‌ను విడుదల చేస్తారు.

నాలుగు వందల 75 కోట్ల రూపాయలతో బనాస్ కాశీ సంకుల్ ప్రాజెక్టు కింద అమూల్‌ ప్లాంట్‌ని నిర్మించనున్నారు. పూర్వాంచల్‌లోని 10 జిల్లాల ప్రజలు ఈ ప్లాంట్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో రోజుకు 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్లాంట్‌ దాదాపు ఒకటిన్నర నుంచి రెండేళ్లలో సిద్ధమవుతుంది.

…………………………………: అంతరిక్షంలో హెయిర్‌కట్.. బార్బర్ రాజా స్పేస్ సెలూన్ చూశారా..

ప్లాంట్ సాయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌కి 120 కిలోమీటర్ల పరిధిలో చిల్లింగ్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ప్రతి గ్రామంలో పాల సేకరణ కోసం పాల కేంద్రాలను ప్రారంభించనున్నారు. వీటి కోసం పాల కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రామాణిక ఆపరేటింగ్ విధానంలో పాలను కొనుగోలు చేస్తుంది. నిర్ణీత సమయంలో కంపెనీ వాహనం నుంచి పాలు సేకరిస్తారు.