Ukraine Crisis : యుక్రెయిన్‌లో బాంబుల మోత.. తీవ్ర ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
రష్యా అన్నంత పనిచేసింది.. యుక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతో బాంబుల వర్షం కురుస్తోంది.

Ukraine Crisis Panic Stricken Parents Call Back Students From Ukraine
Ukraine Crisis : రష్యా అన్నంత పనిచేసింది.. యుక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతో బాంబుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్‌లో యుద్ధవాతావరణంతో అక్కడి భారతీయులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కీవ్, ఖార్కైవ్ సహా అనేక ప్రాంతాల్లో భారతీయులు నివసిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రెండు రోజుల ముందే హెచ్చరికలు జారీ అయ్యాయి. యుక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కీవ్ ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో విద్యార్థులు చిక్కుకుపోయారు. విమానాలను రద్దు చేయడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉదయం బాంబుల మోతతో నిద్రలేచానంటున్న విజయవాడకు చెందిన రవితేజ వాపోయాడు. యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్లిన అతడు అక్కడే చిక్కుకున్నాడు. దాంతో రవితేజ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లుహాన్ సెక్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో రవితేజ ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. యుక్రెయిన్, రష్యా సరిహద్దు ప్రాంతం రుబిగ్నిలో వాతావరణం భయానకంగా మారింది. స్వదేశానికి వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నా రాలేని పరిస్థితి నెలకొంది.

Ukraine Crisis Panic Stricken Parents Call Back Students From Ukraine
ఉక్రెయిన్ క్యాపిటల్‌ను రష్యా స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని విద్యార్థి రవితేజ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరో రెండు గంటల్లో పవర్, గ్యాస్ సప్లై నిలిపివేస్తారని అంటున్నారు రవితేజ వాపోయాడు. ఈ క్రమంలో రవితేజ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రవితేజ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరోవైపు.. యుక్రెయిన్‌లోని సిక్కోలు విద్యార్థులు, వంశీ కృష్ణ, కుమార స్వామి నాయుడు చెర్ని విష్టి లోని బోకోవినియన్ మెడికల్ కాలేజిలో 5 సంవత్సరం మెడిసిన్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
వాటర్ క్యాన్లు సిద్దం చేసుకుంటున్నామని, విమాన సర్వీసులు ఆగిపోయాయని చెబుతున్నారు. మార్చి 15కి టిక్కెట్లు బుక్ చేసామని, ఎంబసీ వారు ఎవరూ కాంటాక్ట్ అవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎంబిసి వారు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారని అన్నారు. మమ్మల్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విద్యార్థులు కోరుతున్నారు.
Read Also : Russia-Ukraine war : ఉక్రెయిన్‌పై పట్టు కోసం రష్యా ‘త్రిశూల వ్యూహం’..!!