Ukraine Students: ఆపరేషన్ గంగ… యుక్రెయిన్ నుంచి ఢిల్లీకి మూడో ఎయిరిండియా విమానం
యుక్రెయిన్ నుంచి మూడో ఎయిరిండియా విమానం ఇండియాకు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా మూడు విమానాలు యుక్రెయిన్...

Ukraine Students (1)
Ukraine Students: యుక్రెయిన్ నుంచి మూడో ఎయిరిండియా విమానం ఇండియాకు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా మూడు విమానాలు యుక్రెయిన్ వెళ్లి వచ్చాయి. చివరిదైన మూడో విమానంలో 198 మందితో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
మొత్తం గడిచిన 24 గంటల్లో 907 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురాగలిగింది కేంద్రం. రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా యుక్రెయిన్‌లోని భారతీయులను తరలించగలిగారు. శనివారం రాత్రి 219 మంది విద్యార్థులతో కలిసి తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబై చేరుకుంది.
ఆదివారమే రొమేనియా, హంగేరి దేశాల నుంచి మూడు ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీ చేరుకున్నాయి. తమ పిల్లలు స్వదేశానికి తిరిగి రావడంతో తల్లిదండ్రుల భయాందోళనలు దూరమయ్యాయి.
Read Also : రష్యాకు ఎదురుదెబ్బ..! 4,300 మంది సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్