Ukraine Strategy : రష్యా బలగాలను దారిమళ్లించేందుకు యుక్రెయిన్ వ్యూహం.. రోడ్లపై సైన్ బోర్డులను మార్చేస్తున్నారు!

యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. కీవ్ నగరంలోకి మరింత లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రష్యా బలగాలను యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.

Ukraine Strategy : రష్యా బలగాలను దారిమళ్లించేందుకు యుక్రెయిన్ వ్యూహం.. రోడ్లపై సైన్ బోర్డులను మార్చేస్తున్నారు!

Ukraine Company Removing Road Signs To Confuse Russian Troops

Updated On : February 28, 2022 / 7:44 AM IST

Russia-Ukraine war : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. కీవ్ నగరంలోకి మరింత లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రష్యా బలగాలను యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది. రష్యా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యుక్రెయిన్ పై యుధ్ధం ప్రకటించింది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా దళాలు దేశ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుని వస్తున్నాయి. కీవ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్యా బలగాలు

యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లోకి చొచ్చుకుని వచ్చాయి. ఈ క్రమంలో యుక్రెయిన్ అధికారులు రష్యా బలగాలను తికమక పెట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. వారిని తప్పుదోవ పట్టించేందుకు యుక్రెయిన్ బృందాలు తెలివిగా ముందుకు కదులుతున్నాయి. రష్యా బలగాలు (Russian troops) దూసుకొచ్చే రహదారులపై సైన్ బోర్డును మార్చేస్తున్నాయి. రష్యా బలగాల మార్గాన్ని మళ్లీంచేందుకు వేలాది బోర్డులను మార్చేసి గందరగోళానికి గురిచేస్తున్నారు. కొన్ని వేల బోర్డులను యుక్రెయిన్ అధికారులు మార్చేసినట్టు తెలుస్తోంది. రష్యా బలగాలు వెళ్లే మార్గాన్ని వారికి అర్థం కాకుండా ఉండేలా రోడ్లపై సైన్ బోర్డులను మరో మార్గానికి మార్చేస్తున్నారు.

Ukraine Company Removing Road Signs To Confuse Russian Troops (1)

Ukraine Company Removing Road Signs To Confuse Russian Troops

యుక్రెయిన్‌పై దాడులకు తెగబడిన రష్యా బలగాలు యుక్రెయిన్‌ ప్రధాన నగరాల వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో వారిని ఎలాగైనా దారి మళ్లించాలనే ఉద్దేశంతో ప్రధాన రోడ్లలోని సూచిక బోర్డులను తొలగించడంతో పాటు వారిని తప్పుదారి పట్టించేలా మార్పులు చేస్తున్నట్టు యుక్రెయిన్‌ రోడ్డు/రహదారుల నిర్వహణ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆలస్యం చేయకుండా యుక్రెయిన్ రోడ్లపై సైన్ బోర్టులను తొలగించాలని ఆదేశించినట్టు తెలిపింది. కొన్ని సైన్ బోర్డులపై Go f*** yourself”, “Go f*** yourself again” and “Go f*** yourself back ఇలా రాసి ఉంచుతున్నారు. వచ్చిన దారిలోనే రష్యాకు వెళ్లిపోండి అన్నట్టుగా ఆ బోర్డులపై ఇలా పేర్లు దర్శనమిస్తున్నాయి. ఈ యుక్రెయిన్ రోడ్లపై దర్శనమిచ్చే సైన్ బోర్డులకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Russia – Ukraine War: ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన యుక్రెయిన్ విమానాన్ని ధ్వంసం చేసిన రష్యన్లు’