Ukrainian Flag : రష్యా యుద్ధ ట్యాంకుపై రెపరెపలాడిన యుక్రెయిన్ జాతీయ జెండా.. వీడియో వైరల్..!
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నేటికి 12రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ పౌరుడు తమ జాతీయ జెండాతో రష్యా యుద్ధ ట్యాంకును ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది.

Ukrainian Flag Ukrainian Man Climbs Onto Russian Tank, Waves National Flag As Crowd Cheers
Ukrainian Flag : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం సోమవారం (మార్చి 7) నాటికి 12రోజుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకూ ఈ యుద్ధంలో వందల సంఖ్యలో పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా దాడితో యుక్రెయిన్ విలవిలలాడిపోతోంది. ఈ క్రమంలో యుక్రెయిన్ పౌరులు చాలామంది ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
మరికొంతమంది యుక్రెయిన్ పౌరులు రష్యా బలగాల దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ దేశంలోకి రావద్దంటూ రష్యా యుద్ధ ట్యాంకులకు అడ్డుపడుతున్నారు. మా దేశాన్ని మేం కాపాడుకుంటామని యుక్రెయిన్ పౌరులు నినదిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దలు, మహిళలతో సహా అందరూ రష్యాతో యుద్ధానికి సిద్ధమంటు ముందుకు వస్తున్నారు. రష్యా దళాలకు ఎదురునిలిచి పోరాడుతున్నారు.

Ukrainian Flag Ukrainian Man Climbs Onto Russian Tank, Waves National Flag As Crowd Cheers
రష్యా బలగాలు యుద్ధ ట్యాంకులతో యుక్రెయిన్ నగరాల్లో ప్రవేశించినప్పటికీ ఆ దేశ పౌరులు ఏమాత్రం భయపడకుండా అడ్డంగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో ఓ యుక్రెయిన్ పౌరుడు కూడా రష్యా యుద్ధ ట్యాంకులకు అడ్డంగా నిలబడ్డాడు. రష్యా యుద్ధ ట్యాంకులు యుక్రెయిన్ రోడ్లపై దూసుకెళ్తుండగా.. ఓ యుక్రెయిన్ పౌరుడు తమ జాతీయ జెండాతో ఎదురునిలిచాడు. అంతటితో ఆగకుండా చేతిలో యుక్రెయిన్ జాతీయ జెండాతో ఏకంగా రష్యా యుద్ధ ట్యాంకునే ఎక్కేశాడు. యుద్ధ ట్యాంకుపై నిలబడి తమ జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ అటు ఇటూ ఊపుతూ కనిపించాడు.
ఆ యువకుడిని చూసి అక్కడే నిలబడి చూస్తున్న ఇతర యుక్రెయిన్ పౌరులు హర్షధ్వానాలు చేశారు. యుక్రెయిన్ పై దండెత్తి వచ్చిన రష్యా బలగాలను యుక్రెయిన్ పౌరులు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో యుక్రెయిన్ ప్రధాన నగరాలను రష్యా బలగాలు తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో రష్యా బలగాలతో పోరాడి దాదాపు 331 మంది యుక్రెయిన్ పౌరులు మరణించగా.. దాదాపు 1.4 మిలియన్లకు పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలసగా వెళ్లినట్టు యూఎన్ మానవహక్కుల కార్యాలయం వెల్లడించింది.
A Ukrainian climbed onto a Russian tank and hoisted the Ukrainian flag.#UkraineRussianWar #Ukraine #UkraineUnderAttack #UcraniaRussia #RussianUkrainianWar pic.twitter.com/BFrQKZvLlE
— David Muñoz López ?????? (@dmunlop) March 7, 2022
యుక్రెయిన్ పౌరుడు తమ జాతీయ జెండాతో రష్యా యుద్ధ ట్యాంకును ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ యుక్రెయిన్ పౌరుడు తమ జాతీయ జెండాను అటుఇటు ఊపుతూ రెపరెపలాడించడం కనిపిస్తోంది. వైరల్ వీడియో ఇదే..
Read Also : Chinese Man : మా ప్రభుత్వం మమ్మల్ని వదిలేసింది… నేను ఎలా బతికేది.. యుక్రెయిన్‌లో చిక్కిన చైనా యువకుడి ఆవేదన!