UAE censorship on films : సినిమాలపై సెన్సార్‌ ఎత్తివేసిన UAE..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్‌(యూఏఈ) విదేశీయులను ఆకట్టుకునే దిశగా యోచిస్తోంది. దీంట్లో భాగంగానే..సినిమాలపై సెన్సార్‌ ను పూర్తిగా ఎత్తివేసినట్లుగా ప్రకటించింది.

UAE censorship on films : సినిమాలపై సెన్సార్‌ ఎత్తివేసిన UAE..

Uae Lifts Censorship On Films In Theaters

Updated On : December 21, 2021 / 1:17 PM IST

UAE lifts censorship on films in theaters : అరబ్ దేశం సినిమాలపై సెన్సార్ ను ఎత్తివేసింది.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్‌(యూఏఈ) విదేశీయులను ఆకట్టుకోవటానికి ఉదారవాద ముద్రను పెంచుకునే దిశగా యోచిస్తోంది. దీంట్లో భాగంగానే..సినిమాలపై సెన్సార్‌ ను పూర్తిగా ఎత్తివేసినట్లుగా ప్రకటించింది. కాగా యూఈఏ జనాభాలో 90% మంది ప్రవాసులే ఉన్నారు. దీంతో అంతర్జాతీయ చిత్రాలు ఇక్కడ విడుదల అవుతుంటాయి.

Read more : దుబాయ్ వెళ్తున్నారా?: UAE కొత్త ఐదేళ్ల VISA స్కీమ్ అంటే తెలుసా?

నగ్నత్వం, స్వలింగ సంపర్కం, లైంగిక దృశ్యాల వంటివి ఉన్న సినిమాలను యూఈఏలో యూఏఈలో సెన్సార్‌ చేసేవారు. కానీ ఇప్పుడు వాటిపై సెన్సార్ ను ఎత్తివేశామని సోషల్ మీడియా వేదికగా యూఈఏ ప్రకటించింది. ఇకనుంచి అంతర్జాతీయ సినిమాలను యథాతథంగా యూఈఏ థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని ప్రకటించింది.

సాంప్రదాయిక ఇస్లామిక్‌ విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే అంశాలను సినిమాల నుంచి తొలగించే బదులుగా ‘21 ప్లస్‌’ అనే కొత్త వయోవర్గాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఎమిరేట్‌ మీడియా నియంత్రణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. యూఏఈ థియేటర్లలో అంతర్జాతీయ సినిమాలను యథాతథంగా ప్రదర్శించవచ్చని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. గతంలో నగ్నత్వం, స్వలింగ సంపర్కం, లైంగిక దృశ్యాల వంటివి యూఏఈలో సెన్సార్‌ చేసేవారు.

Read more : Bajrangi Bhaijaan 2: టాలీవుడ్ మీద కన్నేసిన సల్మాన్.. తెలుగు రైటర్‌తో మరో సినిమా!

ప్రతి పదిమందిలో తొమ్మిది మంది విదేశీయులే ఉండే యూఏఈలో అరబ్బు రాజ్యాలకు భిన్నమైన సంస్కరణలు చాలానే తెచ్చారు. అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లకు అనుగుణంగా 2022 నుంచి శుక్రవారానికి బదులుగా శని, ఆదివారాల వారాంతపు సెలవులు కూడా అమలు చేయనున్నారు.