భేష్ భారత్: అఫ్ఘన్ సపోర్ట్ విషయంలో అమెరికా ప్రశంసలు

అఫ్ఘనిస్తాన్‌కు అందిస్తున్న సహకారాన్ని అమెరికా విరమించుకుంటున్న వేళ భారత్ ఆపన్నహస్తం అందజేసింది. ఈ విషయం పట్ల అమెరికా ప్రభుత్వం భారత ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. 2001వ సంవత్సరంలో అమెరికా తాలిబాన్లపై పోరాటానికి దిగింది. అప్పటి నుంచి భారత్ వారికి మూడు బిలియన్ డాలర్ల వరకూ ఆర్థిక సహాయాన్ని అందించింది.
హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘అఫ్గానిస్థాన్‌లో భారత్ పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో అమెరికాకు చెందిన అఫ్గానిస్థాన్ విభాగం ఇన్‌ఛార్జి జాక్సన్ ఈ ప్రశంసలు కురిపించారు. భారత్ నుంచి అమెరికాకు ఎప్పుడూ మద్దతు ఉంటుందనన్నారు.
భారత్‌తో ట్రంప్ మెరుగైన సంబంధాల్ని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. దక్షిణాసియాపై అనుసరిస్తున్న వ్యూహంలో తమకు కావాల్సింది అదేనని స్పష్టం చేశారు. అమెరికన్లు తాలిబాన్లతో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటున్నారని, అదే దిశగా తాము అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా తగ్గినప్పటికీ ఐసీసీ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.