Niagara Falls freeze : గడ్డ కట్టిన నయాగరా .. అయినా ఆ అందమే వేరయా..

అమెరికా మంచు తుపానులో చిక్కుకుని గజగజ వణికిపోతోంది. మైనస్ డిగ్రీల చలికి సలసలా మరిగే నీరు కూడా గడ్డకట్టిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రసిద్దిగాంచి ‘నయాగరా జలపాతం’ కూడా మూగబోయింది. నయాగరా జల సవ్వడులు మూగబోయాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అందాల నయాగరా జలపాతం గడ్డకట్టింది. గడ్డకట్టిపోవటంతో నయాగర మంచుదిబ్బలుగా కనిపిస్తోంది.

Niagara Falls freeze : గడ్డ కట్టిన నయాగరా .. అయినా ఆ అందమే వేరయా..

Niagara Falls freeze

Updated On : December 28, 2022 / 12:51 PM IST

Niagara Falls freeze : అమెరికా మంచు తుపానులో చిక్కుకుని గజగజ వణికిపోతోంది. ఎంతోమంది చలికి ప్రాణాలు కోల్పోతున్నారు. మైనస్ డిగ్రీల చలికి సలసలా మరిగే నీరు కూడా గడ్డకట్టిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రసిద్దిగాంచి ‘నయాగరా జలపాతం’ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. జలజలా పారుతోంది అనుకుంటున్నారా? కానే కాదు ఉవ్వెత్తున ఎగసిపడే నీటితో దుమికి నయాగరా జల సవ్వడులు మూగబోయాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అందాల నయాగరా జలపాతం గడ్డకట్టింది. దీంతో జల సవ్వడులు మూగబోయాయి. గడ్డకట్టిపోవటంతో నయాగర మంచుదిబ్బలుగా కనిపిస్తోంది.

అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా జలపాతం అందాలు వర్ణణాతీతం. ఈ జలపాతం అందాలు వర్ణించటానికి మాటలు సరిపోవు. ఎంతసేపు చూసినా తనివితీరని అందం నయగరా సొంతం. అటువంటి జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ‘బాంబు తుఫాను’ బీభత్సం సృష్టిస్తున్న వాతావరణ పరిస్థితుల్లో నయగరా జలతరంగాలు మూగబోయాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో నయాగరా కూడా గడ్డకట్టుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా ఎటుచూసినా మంచు గడ్డలే దిబ్బలు దిబ్బలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. దీంతో నయాగరా అందాలు సైతం గడ్డ కట్టుకుపోయాయి.

ఈ బాంబు తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 60మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 8 నుంచి మైనస్‌ 48 డిగ్రీల వరకు పడిపోయాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు భయానకంగా మారి ప్రజలు ప్రాణాలతో ఉండటానికి కూడా పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులపై మంచు దిబ్బల్లా పేరుకుపోయాయి.