US-China rivalry: అమెరికా-చైనాల్లో ఎవరి ఆర్మీ సామర్థ్యాలెంత?
చైనా తమ దేశానికి చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీని 2027 నాటికి మోడరన్ ఫైటింగ్ ఫోర్స్ గా మార్చాలని ప్లాన్ చేసింది. అమెరికాతో నెలకొన్న ఒత్తిడుల కారణంగా మరింత బలోపేతంగా మారేందుకు ప్రయత్నిస్తుంది.

Us China 2
US-China rivalry: చైనా తమ దేశానికి చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీని 2027 నాటికి మోడరన్ ఫైటింగ్ ఫోర్స్ గా మార్చాలని ప్లాన్ చేసింది. అమెరికాతో నెలకొన్న ఒత్తిడుల కారణంగా మరింత బలోపేతంగా మారేందుకు ప్రయత్నిస్తుంది. వచ్చే దశాబ్దం నాటికి పెద్ద ప్రమాదమే తీసుకురానుందని ఒక సీనియర్ యూఎస్ కమాండర్ చైనా గురించి అన్నారు.
మిలటరీ ఒత్తిడులు పెరుగుతున్నా.. రాజకీయంగా బలోపేతమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా మిలటరీ:
ప్రపంచంలోనే మిలటరీ కోసం ఖర్చు పెట్టే అతిపెద్ద బడ్జెట్ అమెరికాదే. గతేడాది 778 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. అంటే 39శాతం దీనికి ఖర్చు పెట్టినట్లు స్టాక్ హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వెల్లడించింది.

Us China 1
ఈ విషయంలో చైనా 252 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి రెండో స్థానంలో ఉంది. మిలటరీ ఖర్చులపై ఫోకస్ పెడుతూ అమెరికా అనలిస్టులు ముందస్తు సూచనలు చేస్తున్నారు. ఇటీవలే చైనా డిఫెన్స్ కేటాయింపులను 6.8శాతం పెంచింది.
మానవ శక్తి:
ప్రపంచంలోనే అతి పెద్ద మిలటరీ చైనా దగ్గరే ఉంది. 2019లెక్కల ప్రకారం చూసినా 2మిలియన్ మంది యాక్టివ్ గా ఉన్నారు. రాబోయే ఫైనాన్షియల్ నాటికి అమెరికా మిలటరీ 1.35లక్షలకు పెంచుతుంది. కాకపోతే 8లక్షల మందిని రిజర్వ్ లో ఉంచుకుంది అమెరికా. ఏదేమైనా టెక్నాలజీ, ఎక్విప్మెంట్ అనే రెండు ముఖ్యమైన విషయాలే. ఇరు దేశాల్లో మోడరన్ వార్ఫేర్ కు దోహదపడే అంశాలే.
గ్రౌండ్ ఫోర్స్:
పీపుల్ లిబరేషన్ ఆర్మీ 915 యాక్టివ్ డ్యూటీ ట్రూపులతో ప్రపంచంలోనే అతిపెద్దది. అంటే 4లక్షల 86వేల మంది ఉన్న అమెరికా బలగం కంటే రెట్టింపు అని పెంటగాన్స్ 2020 చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ చెబుతుంది.

Us China 3
మోడరేట్ ఆయుధాలు లేకుండా మోడరేట్ ఆర్మీగా తయారుకాదనే ఉద్దేశ్యంతో పీఎల్ఏ ప్లాన్ చేసింది. ఫిజికల్ గ్రంట్ వర్క్ ను డిజిటల్ టెక్నాలజీగా మార్చి సామర్థ్యం పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. కాకపోతే ట్రైనింగ్ అనేది ఇంకా జరగలేదని మిలటరీ ఎక్స్‌పర్ట్‌లు అంటున్నారు.
అమెరికా ఆర్మీలో 6వేల 333 ట్యాంకులతో రెండో అతి పెద్ద హోల్డింగ్స్ ఉన్న దేశంగా మారింది. ఇందులో రష్యా మొదటి స్థానంలో ఉండగా 5వేల 800 ట్యాంకులతో చైనా మూడో స్థానంలో ఉందని ఫోర్బ్స్ కథనం వెల్లడించింది.

Us China 5
ఎయిర్ పవర్: యూఎస్
13వేల మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్, 5వేల 163 ఎయిర్‌క్రాఫ్ట్‌లను యూఎస్ ఎయిర్ ఫోర్స్ మెయింటైన్ చేస్తుంది. అందులోనే ఎఫ్-35 లైటినింగ్, ఎఫ్-22 రాప్టర్ లు కూడా ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్ కంబాట్ జెట్స్ అని 2021 వరల్డ్ ఎయిర్ ఫోర్సెస్ రిపోర్ట్ చెబుతుంది.
చైనా ఏవియేషన్ ఫోర్స్ 2వేల 500 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో మూడో స్థానంలో ఉంది. మోస్ట్ అడ్వాన్స్ డ్ స్టీల్త్ ఫైటర్ జెట్ స్వతంత్ర్యంగా డెవలప్ చేసిన జే-20(మైటీ డ్రాగన్) కూడా బలగంలో చేర్చుకుంది. ఇరు దేశాల కొత్త బాంబర్లు తయారుచేయడాని కోసమే పనిచేస్తున్నాయి.
నావల్ పవర్ : యూఎస్
ప్రపంచంలోనే అతిపెద్ద నావీ ఫోర్స్ చైనాకు ఎంది. అమెరికాకు 297 నావీ షిప్ లు ఉంటే చైనాకు 360 షిప్ లు ఉన్నాయని కాంగ్రెషనల్ రిపోర్ట్ చెబుతుంది.