ఉక్కు కంటే 14 రెట్లు గట్టి ప్లాస్టిక్ : బుల్లెట్ ని కూడా ఆపేస్తది

  • Published By: veegamteam ,Published On : September 20, 2019 / 10:27 AM IST
ఉక్కు కంటే 14 రెట్లు గట్టి ప్లాస్టిక్ : బుల్లెట్ ని కూడా ఆపేస్తది

Updated On : September 20, 2019 / 10:27 AM IST

ఉక్కు (ఇనుము) అంటే చాలా బలమైనది..బరువైనది కూడా. కానీ ఉక్కు కంటే గట్టిగా ఉండే వస్తువేమన్నా ఉందా? ఉంటుందా? అంటే ఉంది అంటున్నారు అమెరికా సైంటిస్టులు. అదేటంటే ప్లాస్టిక్. అదేంటి ప్లాస్టిక్ చాలా తేలిగ్గా ఉంటుంది..ఇనుము పోలికేంటి అనే డౌట్ వస్తుంది. అక్కడే ఉంది అసలు విషయం. అమెరికా సైంటిస్టులు ఇనుము కంటే గట్టిగా ఉండే ప్లాస్టిక్ ను రూపొందించారు. అంతేకాదు ఈ ప్లాస్టిక్ ఇనుము కంటే 14 రెట్లు గట్టిగా ఉంటుంది. ఎనిమిదింతలు తేలిగ్గా కూడా ఉంటుందంటున్నారు. ఉక్కును తలదన్నే ఆ ప్లాస్టిక్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం…  

ఉక్కు కంటే దృఢమైన ప్లాస్టిక్‌ను అమెరికాలోని బఫెల్లో యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేశారు. ఈ విషయాన్ని అమెరికా సైనిక పరిశోధక బృందం వెల్లడించింది. ఇనుము కంటే 14 రెట్లు గట్టిగానూ, ఎనిమిదింతలు తేలికగానూ ఉండే ఈ ప్లాస్టిక్..ఆయుధాలు, హెల్మెట్లు, బాలిస్టిక్ ప్లేట్లు,యుద్ధ వాహనాల వంటి అన్ని యుద్ధ  వస్తువుల తయారీలో బరువైన ఉక్కుకు బదులుగా తేలికగా ఉండే దీనిని ఉపయోగించవచ్చని సైంటిస్ట్ షెంకియాంగ్‌ రేన్‌ తెలిపారు.

అత్యంత అణుభారం కలిగిన పాలీ ఇథలీన్‌ (సాధారణంగా వినియోగించే ప్లాస్టిక్‌) నుంచే దీనిని అభివృద్ధి చేశామని తెలిపారు. కాల్షియం కార్బొనేట్‌ను లాక్కొని ఆల్చిప్పలు ముత్యాన్ని వృద్ధినట్లుగానే ఈ పదార్థాన్ని కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. ఏవైనా వస్తువులు దీనికి బలంగా తగిలినప్పుడు విరూపం చెంది, వాటిని లాగేసుకుంటుందని తెలిపారు. దీనిని స్పూత్ గార్డ్ అని కూడా పిలుస్తామని..ఈ ప్లాస్టిక్ బుల్లెట్లను ఆపగల సామర్థ్యం గలదనీ వెల్లడించారు.