Pfizer Covid Vaccine : ఫైజర్ టీకాకు అమెరికా పూర్తిస్థాయి అనుమతులు
ఫైజర్ బయో ఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది.

Pfizer Covid Vaccine
Pfizer Covid Vaccine : ఫైజర్ బయో ఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటివరకు అత్యవసర వినియోగం కోసమే దీనికి అనుమతి ఉండేది. అయితే తాజాగా పూర్తి స్థాయి అనుమతులు ఇస్తూ.. అమెరికా ఔషధ నియత్రంణ సంస్థ ఎఫ్ డీఏ ప్రకటన జారీ చేసింది. కొన్ని పరిశోధనల్లో ఈ టీకా 97శాతం సామర్థ్యంతో పని చేసినట్లు తేలింది.
ఓవైపు డేంజర్ గా మారిన డెల్టా వేరియంట్, మరోవైపు కరోనా థర్డ్ వేవ్ భయాలు.. ఈ క్రమంలో అమెరికా అలర్ట్ అయ్యింది. ఫైజర్ టీకాకు అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్ 19 చేస్తున్న పోరాటంలో ఫైజర్ వ్యాక్సిన్ కు ఎఫ్ డీఏ అప్రూవల్ ఇవ్వడం ఓ మైలురాయి అని FDA కమిషనర్ జానెట్ వుడ్ కాక్ అన్నారు. ఇప్పటికే మిలియన్ల మంది కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఎఫ్ డీఏ అప్రూవల్ ఇచ్చిన వ్యాక్సిన్.. టీకాలు తీసుకోవాలనే కాన్ఫిడెన్స్ ని పెంచుతుందన్నారు. ఎఫ్ డీఏ నుంచి పూర్తి స్థాయి అనుమతులు పొందిన ఈ వ్యాక్సిన్ కొమిరాంటీ అనే బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి రానుంది. డిసెంబర్ 11 2020న వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి మిలియన్ల వ్యాక్సిన్ షాట్లు ప్రజలకు ఇచ్చారు.
40వేల మంది పై క్లినికల్ ట్రయల్స్ చేశారు. దాని నుంచి వచ్చిన డేటా, భద్రత, సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని వ్యాక్సిన్ కు పూర్తి స్తాయి అనుమతులు మంజూరు చేశారు.
వ్యాక్సిన్ కు పూర్తి స్తాయి అనుమతులు రాగానే తప్పనిసరి చేస్తామని యూఎస్ మిలటరీ ఇదివరకే ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారాలు, విశ్వ విద్యాలయాల్లోనే తప్పని సరి చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఇస్తున్నారు. ఎఫ్ డీఏ పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేయడంతో ఇకపై డాక్టర్లు ఈ వ్యాక్సిన్ ను పిల్లలకు రెకమెండ్ చేయనున్నారు. దాని వల్ల పిల్లలకు లాభం కలగనుంది.