‘X’ gender passport : అమెరికాలో తొలి ‘ఎక్స్’జెండర్ పాస్‌పోర్టు..ఫస్ట్ ఇచ్చింది అతనికేనా?
అమెరికాలో పురుషులు, మహిళలు కాని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. ‘ఎక్స్’జెండర్ పాస్ పోర్ట్ జారీ చేసింది

Us Issues Its First Passport With X Gender Marker
US issues first passport with ‘X’ gender marker : అమెరికా ప్రభుత్వం పురుషులు, మహిళలు కాని LGBTQ వర్గానికి కొత్త జెండర్ హోదాను కల్పించింది. అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు వేసింది అగ్రరాజ్యం అమెరికా. ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. దీంతో ఆయా వర్గాలవారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది చరిత్రాత్మక పరిణామం అంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దీని గురించి ఎల్‌జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ మాట్లాడుతు..ఇది చాలా సంతోషించాల్సిన విషయం అని..పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని అన్నారు.
Read more : ICC T20 : పాక్ విజయంపై సంబరాలు చేసుకుంటే..దేశ ద్రేహం కేసులు
‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. కానీ దీనిపై ప్రభుత్వం ఆయా వర్గాల వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.గోప్యతను కాపాడాలనే ఉద్ధేశ్యంతో ఈ ‘ఎక్స్’ జెండర్ పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయం అని అధికారులు తెలిపారు.
Read more : Telangana: మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు..70 మంది విద్యార్థులకు అస్వస్థత
కాగా..కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. కానీ అతనికి అది నచ్చలేదు. స్త్రీగా మారాలని నిర్ణయించుకున్నారు. దాంతో లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. ఈ కారణంగా విదేశాలకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనలాంటి వారికి ప్రత్యేక పాస్‌పోర్టులు జారీ చేయాలని 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా జారీ చేసిన తొలి ‘X’ జెండర్ పాస్‌పోర్ట్ జిమ్‌కేనని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ కూడా ఇలాంటి పాస్‌పోర్టులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.