oneT shirt only 50 paisa : 50పైసలకే టీ షర్టు..ఎగబడ్డ జనాలు..రంగంలోకి దిగిన పోలీసులు
ఒక్క టీ కేవలం 50 పైసలు అని ప్రకటించిందో ఓ షోరూమ్. దీంతో జనాలు కరోనా నిబంధనల్ని గాలికొదిలేసి మరీ భారీగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి..

1 T Shirt Only 50 Paisa
సరుకులైనా బట్టలైనా తక్కువ ధరకే వస్తున్నాయంటే జనాలు ఎగబడి పోవటం సర్వసాధారణం. షాపు తీయకుండానే క్యూ కట్టేస్తారు. కానీ ఈ కరోనా సమయంలో ఇటువంటి ఆఫర్లు జనాల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. అయినా సరే జనాలు కరోను కూడా లెక్క చేయకుండా ఎగబడుతుంటారు. అలాగే జరిగింది తమిళనాడులోని తిరుచ్చిలో. ఓ బట్టల షాపువారు 50పైలకే ఓ టీషర్టు అని ప్రకటించటంతో జనాలు వేలం వెర్రిగా ఎగబడ్డారు.దీంతో ఇంకేముంది ట్రాఫిక్ జామ్.ఇసుక వేస్తే రాలనంత జనాలు. ఆ జనాలను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు.
Read more : దీపావళి బంపర్ ఆఫర్ : రూ.1కే చొక్కా, రూ.10 కే నైటీ
తిరుచ్చిలోని మనప్పరైలో బస్టాండ్ సమీపంలోని చిన్నకడై రోడ్లో ఓ క్లాత్ షోkhరూమ్ వారు అక్టోబర్ 21న షాపును తెరుస్తామనీ..50 పైసలకే టీ-షర్ట్ ఇస్తామని ప్రకటించారు. దాంతో ప్రజలు పెద్ద సంఖ్యలో షాపుకి వచ్చారు. షాపు తెరవకముందే గుంపులుగా జనం పోగయ్యారు. షాపువారు సాధ్యమైనంత వరకు జనాలకు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు తీసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ అని చెప్పారు. ఆ టోకెన్ల కోసం జనాలు ఎగబడ్డారు.దీంతో రోడ్డు పైనా జనం నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్. ఉదయం 9 గంటలకు షటర్ ఓపెన్ చెయ్యగానే… తోసుకుంటూ, నెట్టుకుంటూ జనం షాపులోకి పరుగులు పెట్టారు. షాపులో వారు అంతమందికి ఒకేసారి టీషర్లు అమ్మలేక చేతులెత్తేశారు.ఫలానా ప్రాంతంలో జనాలు భారీగా పోగుపడ్డారని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి జనాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంతమంది పోగు పడటానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి అక్కడికి వెళ్లారు. అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులు ఆ షాపును మూయించారు.
Read more : రూ.9కే చీర : మహిళలకు బంపర్ ఆఫర్
ఈ కరోనా కాలంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్పాటించడం కంపల్సరీ.. మరి ఇవన్నీ ఖచ్చితంగా అమలు చెయ్యాల్సిన బాధ్యత కూడా షాపుల వారిదే. కానీ ప్రకటన అయితే ఇచ్చారు గానీ షాపువారు రూల్స్ ఏమాత్రం అమలు చేయలేదు. దీంతో పోలీసులు షాపు మూసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత షాపు నిర్వాహకులు పోలీసుల్ని బతిమాలుకున్నారు. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తు ఆఫర్ లేకుండా… మధ్యాహ్నం 12 గంటల తర్వాత షాపు
తెరవటానికి అనుమతినివ్వటంతో వారి పని వారు చేసుకోవటం కథ సుఖాంతమైంది.