Alaska Plane Crash : అలాస్కాలో కూలిన విమానం…అమెరికా చట్టసభ సభ్యురాలి భర్త మృతి

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో యూఎస్ ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త యూజీన్ పెల్టోలా జూనియర్ మరణించారు. అలాస్కాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.....

Alaska Plane Crash : అలాస్కాలో కూలిన విమానం…అమెరికా చట్టసభ సభ్యురాలి భర్త మృతి

Alaska Plane Crash

Updated On : September 14, 2023 / 10:50 AM IST

Alaska Plane Crash : అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో యూఎస్ ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త యూజీన్ పెల్టోలా జూనియర్ మరణించారు. అలాస్కాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. అలస్కాలోని సెయింట్ మేరీస్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. (US lawmakers husband killed in plane crash)

Encounter : అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

కూలిన విమానంలో పైలట్‌గా ఉన్న పెల్టోలా భర్త మాత్రమే ఉన్నారు. (Alaska Plane Crash) పెల్టోలా కార్యాలయం బుధవారం యూజీన్ పెల్టోలా జూనియర్ మరణాన్ని ధృవీకరించింది. అలాస్కాలో తరచూ చిన్న విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.

Viral Fever Cases : ఢిల్లీని వణికిస్తున్న జ్వరాలు…డెంగీ, స్వైన్ ఫ్లూ, వైరల్ ఫీవర్ కేసులు

అలాస్కాలో పర్వత భూభాగం కారణంగా ప్రజలు దూరప్రాంతాలకు చేరుకోవడానికి విమానాల్లో ప్రయాణిస్తుండటంతో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. 2010లో అలాస్కాలో జరిగిన విమాన ప్రమాదంలో యూఎస్ మాజీ సెనేటర్ టెడ్ స్టీవెన్స్, మరో ముగ్గురు మరణించారు.