Biden 50% Discount At Restaurant : రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ ఆర్డర్ చేసిన జో బైడెన్ .. 50 శాతం డిస్కౌంట్ ఇచ్చిన క్యాషియర్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆయనే స్వయంగా చికెన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ తరువాత పేమెంట్ ఎంత అని అడగంా సదరు రెస్టారెంట్ బైడెన్‌కు బిల్ లో 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఇదికాస్తా బైడెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది.

Biden 50% Discount At Restaurant
Biden 50% discount At Restaurant : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. ఆయనే స్వయంగా చికెన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ తరువాత పేమెంట్ ఎంత అని అడిగారు. దీంతో సదరు రెస్టారెంట్ బైడెన్‌కు బిల్ లో 50 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. ఈవిషయాన్ని బైడెన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయటం అదికాస్తా తెగ వైరల్ అవుతోంది.
కాగా..టాకోస్, బరిట్టోస్, క్యుసడిలాస్ వంటి మెక్సికన్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టపడుతుంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చికెన్ క్యుసడిలాస్‌ను ఇష్టంగా తింటారు. బైడెన్ లాస్‌ఏంజెల్స్‌లోని టాకోస్ 1989 అనే మెక్సికన్ రెస్టారెంట్‌కు వెళ్లారు. బైడెన్ నేరుగా ఆర్డర్ చేశారు. ఆర్డర్‌కు చెల్లించాల్సిన మొత్తం గురించి బైడెన్ అడగ్గా 50 శాతం డిస్కౌంట్ లభించిందని క్యాషియర్ బైడెన్‌కు చెప్పాడు.
16.45 డాలర్ల బిల్లు రాగా.. బైడెన్ తానే స్వయంగా 60 డాలర్లు చెల్లించారు. తర్వాతి ఆర్డర్ ఫ్రీగా ఇవ్వాలని బైడెన్ క్యాషియర్‌ను కోరారు. మీరు తర్వాతి క్యుసడిలా కొంటే నాకు చెప్పాలని జో బైడెన్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వ్యూస్ రాగా..నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను వ్యక్తంచేసారు. దీనికి సంబంధించిన వీడియోను బైడెన్ తన ట్విట్టర్ లో షేర్ చేయటంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
If you got the next quesadilla, let me know. pic.twitter.com/gLJGs98jME
— President Biden (@POTUS) October 14, 2022