Joe Biden : జో బైడెన్ గాల్లో కరచాలనం.. అధ్యక్షుడి తీరుతో అందరూ షాక్.. వీడియో వైరల్..!

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగం చేస్తున్నారు. అక్కడ అంతా పిన్ డ్రాప్ సైలంట్.. అందరూ నిశ్బద్ధంగా ఆయన ప్రసంగాన్ని వింటున్నారు.

Joe Biden : జో బైడెన్ గాల్లో కరచాలనం.. అధ్యక్షుడి తీరుతో అందరూ షాక్.. వీడియో వైరల్..!

Us President Joe Biden Mocked After Shaking Hands With Thin Air Post Speech

Updated On : April 16, 2022 / 10:06 PM IST

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగం చేస్తున్నారు. అక్కడ అంతా పిన్ డ్రాప్ సైలంట్.. అందరూ నిశ్బద్ధంగా ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. గ్రీన్స్‌బోరోలోని నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో దాదాపు 40 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగాన్ని దంచేశారు జో బైడెన్.

ప్రసంగం పూర్తి కాగానే వింతగా ప్రవర్తించారు బైడెన్. ఆయనకు ఏమైందోనని అక్కడివారంతా అలానే చూస్తుండి పోయారు. ప్రసంగం చేశాక తన చేతిని సాచి కరచాలనం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి బైడెన్ పక్కన ఎవరూ లేరు. గాల్లో కరచాలనం చేస్తూ అటు ఇటు తిరిగి వెళ్లిపోయారు.

అప్పటివరకూ బైడెన్ ప్రసంగాన్ని విన్నవారంతా క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకున్నాక చప్పట్లు కొట్టడం మొదలుపెట్టేశారు. కరతాళ ధ్వనులతో మారుమోగిన బైడెన్ దగ్గరకు ఎవరూ వచ్చేందుకు ధైర్యం చేయలేదు. ఆయనే నెమ్మదిగా పొడియం దిగి కిందికి వచ్చి ప్రతిఒక్కరివైపు చూస్తూ చిరునవ్వు చిందించారు. అప్పటివరకూ ప్రసంగంలో బైడెన్ ఎక్కువగా సెమీ కండక్టర్ల ఉత్పత్తికి సంబంధించి నిధులపైనే ప్రస్తావించారు. ఈ సందర్భంగా తాను స్కూళ్లో టీచింగ్ కూడా చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు తాను పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఫుల్ టైం ప్రొఫెసర్ గా కూడా పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, వేదికపై ఎవరికో కరచాలనం చేస్తున్నట్టుగా గాల్లో ఇలా చేయడం ఫన్నీగా అనిపిస్తోంది. ఇప్పుడీ బైడెన్ గాల్లో కరచాలనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Modi – Joe Biden: నేడు మోదీ, జో బైడన్ కీలక భేటీ.. ఉక్రెయిన్‌ అంశంపైనే ప్రధాన చర్చ?