US Job Offer: ఇండియన్లకు అమెరికా జాబ్ ఆఫర్.. సీసీటీవీ చూస్తుంటే కూర్చుంటే చాలు

సీసీటీవీ ఫుటేజిలను చూస్తూ.. నెలకు రూ.30వేలు సంపాదించుకునే జాబ్ లు ఇచ్చేందుకు అమెరికా రెడీ అయింది. అది కూడా ప్రత్యేకించి ఇండియన్లకు. స్టోర్ లో కూర్చొని అనుమానంగా కనిపించిన వ్యక్తుల గురించి స్టోర్ కీపర్ కు తెలియజేయాలి.

US Job Offer: ఇండియన్లకు అమెరికా జాబ్ ఆఫర్.. సీసీటీవీ చూస్తుంటే కూర్చుంటే చాలు

Cctv Footage

Updated On : June 23, 2021 / 5:08 PM IST

US Job Offer: సీసీటీవీ ఫుటేజిలను చూస్తూ.. నెలకు రూ.30వేలు సంపాదించుకునే జాబ్ లు ఇచ్చేందుకు అమెరికా రెడీ అయింది. అది కూడా ప్రత్యేకించి ఇండియన్లకు. స్టోర్ లో కూర్చొని అనుమానంగా కనిపించిన వ్యక్తుల గురించి స్టోర్ కీపర్ కు తెలియజేయాలి. ఈ సర్వీసును లైవ్ ఐ సర్వేలెన్స్ అనే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.

hell, 7-Eleven, Dairy Queen, Holiday Innతో పాటు మరికొన్ని సంస్థలు దీనికి రెడీ అయ్యాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్ గా వ్యవహరిస్తూ సీసీటీవీ పరిశీలిస్తూ ఉండాలి. స్టోర్ లో ఏరియాలు చూస్తూ క్యాషియర్ మీద ఓ కన్నేయాలి. దొంగతనాలు, దోపిడీలు జరిగే సూచనలు ఉంటే తెలియజేయాలి.

అనుమానంగా కనిపించినప్పుడు అలర్ట్ చేస్తే క్యాషియర్ దగ్గర ఉన్న స్పీకర్లలో వినిపిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి ఫ్రిజ్ లలో వస్తువులు తీసుకున్నవి తిని క్యాషియర్ దగ్గరకు వచ్చేసరికి కార్ట్ లో ఉన్న వాటికి మాత్రమే చెల్లిస్తుంటే అంతకుముందు తిన్న వాటికి కూడా చెల్లించమని చెప్పాలి.

అందిన రిపోర్టుల ప్రకారం.. నెలకు 399 అమెరికన్ డాలర్లు. అంటే నెలకు రూ.30వేలు చెల్లిస్తారన్నమాట.