United Nations General Assembly : పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి : భారత్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్, మైనారిటీ హక్కులపై పాకిస్థాన్ వంచనను భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని భారత్ కోరింది....

United Nations General Assembly : పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి : భారత్

Petal Gahlot

United Nations General Assembly : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్, మైనారిటీ హక్కులపై పాకిస్థాన్ వంచనను భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని భారత్ కోరింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ దేశ తాత్కాలిక ప్రధాని అన్వారుల్ హక్ కాకర్ తన ప్రసంగంలో కశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత్ పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. (India talks tough with Pakistan at UN)

Canada : హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు

భారతదేశం ఆక్రమిత ప్రాంతాలను పాకిస్థాన్ ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని కోరారు. (Vacate POK stop terrorism) పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని మొదటి సెక్రటరీ పెటల్ గహ్లోట్ కోరారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, భారతదేశ దేశీయ విషయాలకు సంబంధించి ప్రకటనలు చేయడానికి పాకిస్థాన్‌కు హక్కు లేదని భారత దౌత్యవేత్త పునరుద్ఘాటించారు.

Vande Bharat Express : రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో (United Nations General Assembly) భారత్‌పై నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారం చేసినందుకు భారత దౌత్యవేత్త పాకిస్థాన్‌ను నిందించారు. అంతర్జాతీయంగా నిషేధిత అతిపెద్ద ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నిలయంగా మారిందని, 2011 ముంబై ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని గహ్లోట్ పాకిస్థాన్‌ను కోరారు.

Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు కుమ్ముడే, హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్

పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దైహిక హింసను ఎత్తిచూపుతూ, చర్చిలు, క్రైస్తవుల ఇళ్లను తగులబెట్టిన జరన్‌వాలా ఘటనపై ఆమె మాట్లాడారు.మైనారిటీ వర్గాలకు చెందిన 1000 మంది మహిళలు అపహరించి, బలవంతపు మతమార్పిడులకు, వివాహాలకు పాల్పడ్డారని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ ప్రచురించిన నివేదికను గహ్లోట్ ప్రస్థావించారు.