Cancer Heart Disease Vaccines : క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!

ఈ వ్యాక్సిన్లపై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు కూడా గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయని చెబుతున్నారు. 15ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం 12-18 నెలల్లోనే సాధించి కరోనా వ్యాక్సిన్ ను విజయవంతంగా రూపొందించగలగడమే ఈ నమ్మకానికి కారణమని అంటున్నారు.

Cancer Heart Disease Vaccines : క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!

Cancer Heart Disease Vaccines

Cancer Heart Disease Vaccines : గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి రోగాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని నిరోధించే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు ఎన్నో ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు గుడ్‌ న్యూస్‌ తెలిపారు. గుండె జబ్బులు, క్యాన్సర్ తోపాటు ఆటో ఇమ్యూన్ రోగాలకు చెక్ పెట్టగలిగే ఈ వ్యాక్సిన్లు 2030లోగా సిద్ధమవుతాయని నిపుణులు తెలిపారు.

తద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ వ్యాక్సిన్లపై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు కూడా గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయని చెబుతున్నారు. 15ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం 12-18 నెలల్లోనే సాధించి కరోనా వ్యాక్సిన్ ను విజయవంతంగా రూపొందించగలగడమే ఈ నమ్మకానికి కారణమని అంటున్నారు.

WHO Heart Attacks : గుండెపోటు మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే-డబ్ల్యూహెచ్ఓ కీలక నివేదిక

రాబోయే ఐదేళ్లలోపు తాము అన్ని రకాల రోగాలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురాగలమని ప్రముఖ ఫార్మా కంపెనీ మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాల్ బర్టన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోడెర్నా వివిధ రకాల కణుతులను టార్గెట్ చేసే క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది.