Valentine’s week 2021..Chocolate ప్రత్యేకతలేంటో తెలుసా?
Valentine’s week 2021 spcial : ఫిబ్రవరి 14. వాలెంటైన్స్ డే. ఈ వాలెంటైన్స్ వీక్‌లో ఒక్కో రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ప్రేమికులకు చాక్ లెట్లకు చాలా దగ్గర సంబంధముంది. చాక్ లెట్ వెరీ వెరీ స్వీట్. అలాగే ప్రేమికుల రోజు ప్రేమికులకు వెరీ వెరీ స్వీట్ డే. వాలెంటైన్స్ వీక్‌లో ఏడు రోజుల్లోనూ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకుంటారు.

వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు ఫిబ్రవరి 9. ఫిబ్రవరి 9ని ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ డేగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులు, స్వీట్లు, రింగులు, ఇలా ఇతర గిఫ్ట్స్‌తో పాటు వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్లకు చాలా స్పెషాలిటీ ఉంటుంది.

ప్రేమను, సంతోషాన్ని పంచుకోవటానికి చాక్లెట్లు పంచుకుంటారు. ఇచ్చి పుచ్చుకుంటుంటారు. ఇష్టపడే వారికి ప్రపోజ్ చేసి ప్రేమను వ్యక్తపరిచిన తరువాత చాక్లెట్లతో ఆ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తారు. తమ బంధాన్ని చాక్లెట్ లాగా అందంగా..తియ్యంగా ఉండాలని చాక్లెట్లు బహుమతిగా ఇస్తారు. చాక్లెట్లు రొమాంటిక్ ఫీలింగ్‌కు గుర్తు అని చెప్పకతప్పదు. జీవితంలో చిన్న చిన్న ఆనందాలను, అనుబంధాలను పంచుకోవాలనుకునే వారు చాక్లెట్ డేను ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఉత్తర అమెరికాలోని అజ్టెక్ తెగకు చెందినవారు చాక్లెట్లకు ఎంతో విలువ ఇచ్చేవారు. రోమ్‌లో వీర మరణం పొందిన సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం ఇచ్చిన విందులో చాక్లెట్లు ఇచ్చారని చెబుతుంటారు. అప్పటి నుంచి వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్ డే ఆవిర్భవించింది.

క్యాడ్ బరీ అనే వ్యక్తి హార్ట్ (గుండె ఆకారంలో) షేప్‌లో ఉండే చాక్లెట్లను, చాక్లెట్ బాక్సులను తయారు చేసింది. ఈ హార్ట్ ఆకారంలో ఉండే చాక్లెట్లతో వాలెంటైన్ వారానికి ఆదరణ మరింతగా పెరిగింది. ఈ రోజున ఎవరైనా సరే వాళ్లు ఇష్టపడే వ్యక్తికి చాక్లెట్లతో గిఫ్ట్స్ ఇవ్వవచ్చు. చాక్లెట్ బొకేలు, అసార్టెడ్ చాక్లెట్లు, ప్రత్యేకమైన ఫ్లేవర్లు ఉండే హ్యాండ్ మేడ్ చాక్లెట్లు, క్యాండీలతో చేసే చాక్లెట్ హ్యాంపర్లు, చాక్లెట్ కేక్.. ఇలా ఏదైనా సరే చాక్లెట్ తో చేసినవి బహుమతిగా ఇవ్వవచ్చు.

చాక్లెట్లు ఆనందం పెంచుకోవటానికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెబుతారు నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతాయి. రకరకాల చాక్లెట్లు శరీరంలోని రక్త ప్రసరణను పెంచడంతో పాటు హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. తరచుగా చాక్లెట్లు తినేవారి చర్మం ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. చాక్లెట్లు మూడ్ హ్యాపీగా ఉంచుతాయి. ప్రేమ భావనలను ఎదుటి వారికి తెలియజేయడానికి ఎంతగానో సహాయపడతాయి.

చాక్లెట్ డేను కేవలం ప్రేమికులతోనే చేసుకోవాలని నియమమేం లేదు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఇలా ప్రత్యేకంగా భావించే వారికి కూడా గిఫ్టులుగా ఇవ్వొచ్చు. ప్రేమ, ఆప్యాయతలను గుర్తు చేసే చాక్లెట్ డే వేడుకలను ఇష్టమైన వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండేలా ఇచ్చుకోండి…సంతోషాలను పెంచుకోండీ..సంతోషాలను పంచండీ..

