Mother emotional video : టీవీ స్క్రీన్‌పై కొడుకుని మొదటిసారి జర్నలిస్ట్‌గా చూసుకుని ఎమోషనల్ అయిన తల్లి

పిల్లలు అనుకున్నది సాధిస్తే పేరెంట్స్ ఆనందం వర్ణించలేం. జర్నలిస్టుగా తన బిడ్డ టీవీ స్క్రీన్‌పై మొదటిసారి కనిపించడంతో ఓ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆమె ఎమోషనల్ అయిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Mother emotional video : టీవీ స్క్రీన్‌పై కొడుకుని మొదటిసారి జర్నలిస్ట్‌గా చూసుకుని ఎమోషనల్ అయిన తల్లి

mother emotional video

Updated On : July 26, 2023 / 6:10 PM IST

Mother emotional video : తమ పిల్లలు కనే కలలు నిజమైన వేళ పేరెంట్స్ కళ్లలో ఆనందం మాటల్లో చెప్పలేం. తన కొడుకుని జర్నలిస్ట్‌గా మొదటిసారి టీవీ స్క్రీన్‌పై చూసిన ఓ తల్లి ఆనందం చూస్తే కన్నీరు వస్తుంది.

Telangana Woman : అమెరికా వీధుల్లో నిస్సహాయ స్థితిలో తెలంగాణ మహిళ.. తమ కుమార్తెను ఇండియాకు రప్పించాలంటూ వేడుకుంటున్న తల్లి

goodnews_movement ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో అందరి మనసుని దోచుకుంది. ఓ తల్లి ఆనందం చూసి కన్నీరు తెప్పించింది. తమ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కలలు కంటారు. ఆ క్షణం ఎదురైనపుడు వారిలో గర్వం, ఆనందం ఒకేసారి తొణికిసలాడతాయి. ఈ వీడియోలో తన బిడ్డను జర్నలిస్ట్‌గా చూసినందుకు ఆ తల్లి స్పందించిన తీరు మనసుని హత్తుకుంది. ‘ తన కొడుకు జర్నలిస్టుగా టెలివిజన్‌లో కనిపించడం ఓ తల్లి చూసింది. తను పనిచేస్తున్న చోట సహోద్యోగులతో ఆ క్షణాల్ని ఆస్వాదిస్తూ ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది’ అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

Manipur : నా కుటుంబం భవిష్యత్తు తెలియడం లేదు.. మొదటిసారి మీడియా ముందుకు మణిపూర్ బాధితురాలి తల్లి

ఆ తల్లి చిరునవ్వుతో .. ఆనందంతో గంతులు వేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వెంటనే ముఖం మీద చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించింది. ‘కష్టపడి పనిచేసే ఈ తల్లి కష్టపడి పనిచేసే కొడుకును పెంచింది’ అని.. ‘అభినందనలు ప్రౌడ్ మామా.. కన్నీళ్లను ఆపుకోవాల్సిన అవసరం లేదు.. నీకు హగ్స్’ అంటూ అందరూ అభినందనలతో కామెంట్లు జోడించారు. అందరి మనసుల్ని దోచుకున్న ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Good News Movement (@goodnews_movement)