వీడియో, సిక్కింలో చొరబాటుకు యత్నించిన చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్లు
చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత

చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత
చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత జవాన్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. అంతేకాదు అడ్డంగా వాదనకు దిగిన చైనా సైనికులను తరిమికొట్టారు. తొలుత వెనక్కి వెళ్లాలని చైనా సైనికులకు మనవాళ్లు ఎంతో మర్యాదగా చెప్పారు. అయితే మనోళ్ల విజ్ఞప్తులను పట్టించుకోని చైనా సైనికులు మాటల యుద్ధానికి దిగారు. ఓ చైనా సైనికుడు మనోళ్ల పైపైకి దూసుకొచ్చాడు. దీంతో మన జవాన్లలో కోపం కట్టలు తెంచుకుంది. వారిని బలంగా వెనక్కి నెట్టేశారు. ఓ భారత జవాను చైనా సైనికుడిని ఉతికి ఆరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ”గో బ్యాక్, డోంట్ ఫైట్” అని మనవాళ్లు పదే పదే అంటుండటం ఉంది. సైనికులు ఒకరినొకరు తోసుకోవడం ఈ వీడియోలో ఉంది.
మనపైకి దూసుకొచ్చిన చైనా సైనికుడిని ఉతికేసిన భారత జవాను:
గల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగకముందే సిక్కింలో ఇరుదేశాల సైనికులు గొడవ పడ్డారు. మన భూ భాగంలోకి చొరబడేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. వారిని మనోళ్లు నిలువరించారు. ‘వెనక్కు వెళ్లండి.. గొడవ వద్దు..’ అన్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. మన జవాను చేతిలో దెబ్బలు తిన్న చైనా సైనికుడి గురించి భారత అధికారి అడుగుతున్నది కూడా రికార్డు అయింది. ఈ వీడియో ఎప్పుడు తీశారన్న కచ్చితమైన సమాచారం లేకున్నా.. గల్వాన్ ఘర్షణ తర్వాత, మిలిటరీ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణ వాతావారణాన్ని తగ్గించేందుకు ఇండియా-చైనా దేశాల మధ్య దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే చైనా సైనికులు మరోసారి చొరబాటుకు యత్నించడం ఉద్రిక్తతలను పెంచింది.
చైనా సైనికుల కవ్వింపులు:
గాల్వన్ ఘటన తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మే నెల మొదటి నుంచి సిక్కింలో పలుమార్లు చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. తాజాగా మరోసారి అదే పని చేయగా, మనోళ్లు ధీటుగా నిలువరించారు. నిబంధనలు పట్టించుకోకుండా చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే మన సైనికులు వారిని సమర్థవంతంగా నిలువరిస్తున్నారు. మన భూభాగంలో కాలు పెట్టకుండా చూస్తున్నారు. గాల్వన్ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా సైనికులు కవ్వింపులకు పాల్పడుతున్నారు. మన భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. భారత జవాన్లు చైనా సైనికుల చర్యలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ముందు మంచి మాటలు చెప్పి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వినకపోతే నాలుగు తగిలించి బుద్ధి చెబుతున్నారు. గాల్వన్ ఘటన మర్చిపోకముందే సిక్కింలో చైనా సైనికుల దుశ్చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.
గల్వాన్ లో చైనా దొంగ దాడి:
జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా-భారత్ సైనికుల మధ్య తీవ్రమైన హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా ఆర్మీకి కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం. 43మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు దొంగ దాడి చేశారు. ముందు మన భూభాగంలోకి చొరబడి టెంట్లు వేశారు. వాటిని తొలిగించేందుకు వెళ్లిన మన సైనికులపై పథకం ప్రకారం రాళ్లు, పదునైన ఆయుధాలు, మేకులు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. కొంతమందిని నదిలోకి తోసేశారు. వాళ్లు 300 మంది, మనవాళ్లు 100 మంది. చుట్టూ శత్రు బలగాలు.. అయినా మన సైనికులు భయపడలేదు. సింహాల్లా గర్జించారు. వీరోచితంగా పోరాటం చేశారు. చైనా సైనికులను తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా బుద్ది చెప్పారు. పథకం ప్రకారం దాడి చేసి మనోళ్ల ప్రాణాలు తీసిన చైనాపై భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. డ్రాగన్ ని దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్నారు. సైనికుల త్యాగాన్ని వృథా కానివ్వం అని ప్రధాని మోడీ సైతం అన్నారు. మొత్తంగా ప్రతీసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు, కవ్వింపులకు దిగుతూ మన సైనికులపై దాడులు చేస్తున్న దృశ్యాలు డ్రాగన్ కుట్రలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
Chinese vehicle and a soldier captured in Ladakh. Spread this in all your groups and with your friends, so that people don’t ask for the proof later.
As Received via WhatsApp pic.twitter.com/j7rJbq2s1N
— ದೇಶಭಕ್ತ Nagaraju_KR ?? (@nagaraju_kr) June 17, 2020