Viral Video: సంగీత ప్రదర్శన మధ్యలో బూటులో బీరు పోసుకుని తాగిన సింగర్

సింగర్ హ్యారీ స్టైల్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓ సంగీత ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని పాట పాడుతూ మధ్యలో తన బూటును విప్పాడు హ్యారీ స్టైల్స్. ఆ తర్వాత బూటులో ఏదో ద్రవాన్ని పోసుకుని తాగాడు. ఆ సమయంలో ఒకరు స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: సంగీత ప్రదర్శన మధ్యలో బూటులో బీరు పోసుకుని తాగిన సింగర్

Viral Video

Updated On : February 21, 2023 / 7:22 PM IST

Viral Video: సింగర్ హ్యారీ స్టైల్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓ సంగీత ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని పాట పాడుతూ మధ్యలో తన బూటును విప్పాడు హ్యారీ స్టైల్స్. ఆ తర్వాత బూటులో ఏదో ద్రవాన్ని పోసుకుని తాగాడు. ఆ సమయంలో ఒకరు స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గత రాత్రి పెర్త్ లో సింగర్ హ్యారీ స్టైల్స్ ప్రదర్శన ఇచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హ్యారీ స్టైల్స్ బూటులో బీర్ పోసుకుని తాగినట్లు తెలుస్తోంది. సింగర్ హ్యారీ స్టైల్స్ చర్య పట్ల నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి సంప్రదాయం గురించి తాము ఎక్కడా వినలేదని కొందరు పేర్కొన్నారు.

తనకు తెలిసిన సంప్రదాయాల్లోకెల్లా అత్యంత చిరాకు తెప్పించే సంప్రదాయం ఇదేనని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది చాలా భయంకరంగా ఉందని కొందరు పేర్కొన్నారు. సింగర్ హ్యారీ స్టైల్స్ కాన్సెర్ట్ కి చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. వారందరి ముందే అతడు ఇలా చేయడం గమనార్హం.

Ukraine War: యుద్ధాన్ని కొనసాగిస్తాం.. రష్యాను ఓడించడం అసాధ్యం: ఉక్రెయిన్ లో బైడెన్ పర్యటన వేళ పుతిన్