Viral Video: పెళ్లికొడుకు మెడలో 35 అడుగుల డబ్బుల దండ.. వీడియో వైరల్

మొదట ఆ దండను కొందరు మోసుకువచ్చారు. ఆ తర్వాత దాన్ని పెళ్లికొడుకు మెడలో వేశారు.

Viral Video: పెళ్లికొడుకు మెడలో 35 అడుగుల డబ్బుల దండ.. వీడియో వైరల్

Updated On : November 29, 2024 / 2:11 PM IST

పాకిస్థాన్‌లో ఓ పెళ్లికొడుకుకు 35 అడుగుల భారీ పెళ్లి పూల దండ వేశారు. ఆ దండను కూడా పూలతో చేయలేదు. మొత్తం కరెన్సీ నోట్లతో దాన్ని తయారుచేశారు. కరెన్సీతో ఈ దండను తయారు చేయడానికి లక్ష పాకిస్థాన్‌ రూపాయలను వాడారు.

ఇండియన్ కరెన్సీలో ఆ లక్ష విలువ రూ.30 వేలు చేస్తుంది. పాకిస్థాన్‌ కరెన్సీలో 200 రూపాయల నోట్లను 75, అలాగే, 50 రూపాయలను 1,700ను వాడి ఈ దండను చేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలోని కోట్లా జామ్ ప్రాంతంలో జరిగిన పెళ్లి వేడుకలో వరుడికి ఈ భారీ దండను వేశారు. ఈ దండను పెళ్లికి కానుకగా ఇచ్చారు.

వీడియోలో చూపిన దాని ప్రకారం.. మొదట ఆ దండను కొందరు మోసుకువచ్చారు. ఆ తర్వాత దాన్ని పెళ్లికొడుకు మెడలో వేశారు. ఆ డబ్బుల దండకు పూలు, రంగురంగుల రిబ్బన్లను కూడా కట్టారు. ఆ పూల దండను పెళ్లికొడుకుకి గిఫ్ట్‌గా ఇచ్చింది అతడి సోదరుడే.

YS sharmila: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: షర్మిల ఎద్దేవా