WHO Warning: వైరస్‌లు చుట్టుముడుతున్నాయ్.. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

డబ్ల్యూహెచ్ఓలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్‌లతో పాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

WHO Warning: వైరస్‌లు చుట్టుముడుతున్నాయ్.. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

Maria Van Kerkhove

WHO Warning: పలు రకాల వైరస్‌లు, వ్యాధికారకాలు ప్రస్తుతం అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయి. ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే దాని ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. అయితే, ఇదే సమయంలో వైరస్‌ల వ్యాపక్తి కట్టడిపై పలు దేశాలు అలసత్వం వహిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

WHO Warning Measles : ఒకరి నుంచి 18 మందికి మీజిల్స్‌ సోకే ప్రమాదం.. డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక

డబ్ల్యూహెచ్ఓలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్‌లతో పాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం, మాస్కులు, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారిన పడితే ఇంటిదగ్గరే ఉండటం, చేతులు శుభ్రపర్చుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మారియా వాన్ కెర్ఖోవ్ సూచించారు.

WHO Global Report: భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు.. దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయ్.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 500లకుపైగా ఒమిక్రాన్ ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయని చెప్పారు. ఈ వేరియంట్ల వ్యాప్తి, రోగనిరోధకత నుంచి అవి ఏ విధంగా తప్పించుకుంటున్నాయి. వాటి తీవ్ర వంటి అంశాలు పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ సీజన్లో 1.3 కోట్ల శ్వాసకోశ సంబంధ కేసులు నమోదు కాగా, 1.20లక్షల మంది ఆస్పత్రిలో చేరారని, 7,300 ప్లూ మరణాలు సంభవించినట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది.