Modi And Meloni : ‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’.. మోదీతో మెలోనీ సరదా సంభాషణ.. వీడియో వైరల్
Modi And Meloni : ఫ్రాన్స్‌లో జరుగుతున్నజీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన సరదా సంభాషణ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Modi And Meloni
Modi And Meloni : ‘మెలోడి’ అంటే చాక్లెట్ కంటే ముందుగా ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చేది భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) జోడీనే. సోషల్ మీడియాలో “మెలోడి” పేరుతో ఫేమస్ అయిన ఈ ఇద్దరు నేతలు మరోసారి వార్తల్లో నిలిచారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు (G7 Summit)లో గ్రూప్ ఫొటో సందర్భంగా మోదీ, మెలోనీ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ సందర్భంగా “మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది” అని మెలోనీ చెప్పగా, మోదీ కూడా సరదాగా స్పందించారు. వెంటనే నవ్విన మెలోనీ.. “ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫేమస్ కపుల్ కదా!” అంటూ చమత్కరించడంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. ఈ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మెలోడి” హ్యాష్‌ట్యాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు సరదా మీమ్స్, పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
అసలు ‘మెలోడి’ ట్రెండ్ 2023లో మొదలైంది. దుబాయ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో మెలోనీ, మోదీతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెలోడీ హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించారు. అప్పటి నుంచి ఇద్దరు నేతలు ఎక్కడ కలిసినా సోషల్ మీడియాలో సరదా చర్చలు, మీమ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల మోదీ ఇటలీ పర్యటనలో మెలోనీకి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. వైరల్ అయిన మెలోడి పేరును గుర్తు చేస్తూ ఇచ్చిన ఈ గిఫ్ట్‌కు మెలోనీ కూడా ప్రత్యేకంగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు.
Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN
— Jash (@jeetcasm) June 16, 2026
మరోవైపు.. తాజాగా జీ7 సదస్సు గ్రూప్ ఫొటో సమయంలో మోదీ – మెలోనీ మధ్య ఓ చిన్న సరదా సంభాషణ జరగడం, ఆ వెంటనే మెలోడీ ఫేమస్ కపుల్ అనడంతో మరోసారి వైరల్ అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
