Forest: ఒక నిమిషానికి ఎంత అడవిని కోల్పోతున్నామో తెలిస్తే షాకవుతారు
ఈ అడవులు స్థానిక, ప్రాంతీయ వాతావరణాలను నియంత్రిస్తాయి, అధిక మొత్తంలో నీటిని నిల్వ చేస్తాయి, వర్షపాతాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అడవులను నరికివేయడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కరువు తీవ్రతరం అవుతుంది, పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది

WRI: చెట్లను కాపాడుకోవాలని చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రమాణాలన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్, మేరీల్యాండ్ యూనివర్సిటీ, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ఇచ్చిన ట్రీ కవర్ లాస్ డేటా ప్రకారం.. నిమిషానికి 11 ఫుట్‌బాల్ గ్రౌండ్లంత ఫారెస్ట్ కోల్పోతున్నామట. ఇది 2022 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు. 2021 ఏడాదితో పోలిస్తే ఇది 10 ఎక్కువ. ట్రీ కవర్ లాస్ డేటా విశ్లేషణ ప్రకారం 2022లో అటవీ నష్టం మొత్తం 4.1 మిలియన్ హెక్టార్లు. ఇది స్విట్జర్లాండ్ దేశం పరిమాణంలో ఉంది.
Commissioner Dog Missing : కనిపించకుండాపోయిన కమిషనర్ కుక్క,రంగంలోకి పోలీసు బృందాలు..నగరమంతా గాలింపు
బ్రెజిల్, బొలీవియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అటవీ నష్టం ఎక్కువగా జరుగుతోందట. ఇదే సమయంలో ఇండోనేషియా, మలేషియా దేశాల్లో ఇటీవలి కాలంలో చెట్ల నష్టం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, కలప, మైనింగ్ వంటి ప్రధాన కారణాల వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుతోందని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా లేదా సహజంగా సంభవించే మంటలు కూడా అటవీ నష్టానికి ప్రధాన మూలంగా చెబుతున్నారు.
ఈ అడవులు స్థానిక, ప్రాంతీయ వాతావరణాలను నియంత్రిస్తాయి, అధిక మొత్తంలో నీటిని నిల్వ చేస్తాయి, వర్షపాతాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అడవులను నరికివేయడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కరువు తీవ్రతరం అవుతుంది, పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల 2022లో 2.7 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పెరుగుదలకు దారితీసిందని, ఇది భారతదేశంలోని శిలాజ ఇంధన ఉద్గారాలకు సమానమని ఆన్‌లైన్ డేటా ప్లాట్‌ఫారమ్ అయిన గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డైరెక్టర్ మైకేలా వీస్ చెప్పారు.
2021లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి COP26 వాతావరణ చర్చలో సింగపూర్‌తో సహా 140 కంటే ఎక్కువ దేశాలు 2030 నాటికి అటవీ నష్టం, భూమి క్షీణతను ఆపడానికి అడవులను పెంచే దిశగా గ్లాస్గో లీడర్స్ డిక్లరేషన్‌పై సంతకం చేశాయి. 2022లో బ్రెజిల్ దాదాపు 1.8 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతాన్ని కోల్పోయింది. ఇందులో 1.42 మిలియన్ హెక్టార్లను అగ్నికి సంబంధం లేకి కారణాల వల్ల కోల్పోయింది. 2021తో పోలిస్తే ఇది 20 శాతం పెరిగింది. ఇక మంటల వల్ల 344,064 హెక్టార్లు చెట్లు ధ్వంసం అయ్యాయి. అయితే 2021తో పోలిస్తే ఇది కొద్దిగా తగ్గింది.