కరోనా తర్వాత రెస్టారెంట్లలో ఎలా ఉండబోతుంది.. లాక్‌డౌన్‌లో మారిన ఆహారపు అలవాట్లు మంచిదిలే!

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ఎన్నో మార్పులకు కారణమైంది. ఒకప్పుడు పరిశుభ్రతను పెద్దగా పట్టించుకుని వారంతా కూడా ఇప్పుడు శుభ్రతే జీవితంగా గడిపేస్తున్నారు. కరోనా అంతగా భయపెట్టేసింది. ప్రతిఒక్కరూ కలుషతమైన ఆహారం జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆహార అలవాట్లలోనూ ఎంతో మార్పులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అంతగా మార్చేసింది కరోనా. బయట కరోనా ఉంది.. అందులోనూ లాక్ డౌన్ కూడా.. ఈ రోజు ఏం తినాలి ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఫ్రీజుల్లో దాచిన పదార్థాలనే తినేస్తున్నారు. మహమ్మారితో ప్రజల ఆహారపు అలవాట్లపై భారీగా ప్రభావం పడింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత పరిస్థితులు అనే టాక్ నడుస్తోంది. కరోనాకు ముందు పరిమితి కంటే ఎక్కువగా తినేవారు. మూడింట ఒక వంతు క్యాలరీలను బయటి ఆహారాన్నే ఎక్కువగా తినేస్తుంటారు. చౌకగానూ తక్కువ సమయంలో ఫుడ్ లభించడంతో ఎక్కువగా ఆసక్తి చూపారు.
కానీ, ఇప్పుడు అలా కాదు.. ఏది పడితే అది తినే పరిస్థితి మారిపోయింది. కరోనా పుణ్యమాని అన్ని రంగాల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చేశాయి. వినియోగదారుల నుంచి ఇండస్ట్రీలు సైతం ఇదే మార్గాన్ని ఫాలో అవుతున్నాయి. తాము బయట ఏమి తింటున్నామో కరోనా అందరికి అలోచించే అవకాశం ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఫుడ్ ఎంత ఆరోగ్యమో తెలిసొచ్చింది. బయటి ఫుడ్ తినడానికి కంటే ఇంట్లోనే ఫుడ్ తినేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. స్థానికంగా ఫుడ్ కొంటున్నారు. ఆన్ లైన్ గ్రాసరీ షాపింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.
ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే.. బయట ఫుడ్ తినేవారిలో ఎక్కువ మంది రెస్టారెంట్ ఫుడ్ పైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఇది కూడా ప్రతిఒక్కరి లైఫ్‌లో భాగమైపోయాయి. రెస్టారెంట్లు ఓపెన్ అయితే చాలు.. పదుల సంఖ్యలో కస్టమర్లు రెస్టారెంట్లకు పరుగులు పెడతారు. కానీ, లాక్ డౌన్ సమయంలో చాలామందిలో అలవాట్లు మారిపోయాయి. షాపింగ్ కావొచ్చు.. ఏమి కొంటున్నాము.. ఎలా కుక్ చేస్తున్నాము.. ఇలా ప్రతిఒక్కటి ఆలోచించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉత్పత్తిదారులు.. ఆహారపు ఉత్పత్తులను డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో తీసుకొచ్చేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్ బట్టి ఫుడ్ అందిస్తున్నారు. తర్వాతి రోజుల్లో దీని ప్రభావం భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి పండ్లు, కూరగాయలను తీసుకెళ్లే కూలీల కొరత ఏర్పడే అవకాశం ఉంది.
రెస్టారెంట్లలో భౌతిక దూరం :
రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో తినాలంటే ఇకపై సామాజిక దూరం పాటించాల్సిందే. దీనికి సంబంధించి ఆయా రెస్టారెంట్లు సైతం ఇదే ఫార్మూలను అమలు చేయనున్నాయి. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లతో పాటు వారి సిబ్బందిని ఎలా సురక్షితంగా ఉంచగలమనే విషయంపై ఆలోచనలో పడ్డాయి. కొంతమంది ఆసక్తికరమైన మెథడ్స్ ఫాలో అయిపోతున్నారు. జర్మనీలోని ఓ కేఫ్.. కస్టమర్లను దూరంగా ఉండేలా పూల్ నూడిల్స్ వినియోగిస్తోంది. అందరికి ఒకే రూంలో సర్వింగ్ చేయడానికి బదులుగా గెస్టులను తమ సొంత రూంల్లోనే ఉంచి వారికి సర్వీసు అందిస్తోందో Cotswolds లోని Farncombe Estate అనే హోటల్. రెస్టారెంట్లు, బార్లు అతి త్వరలో కస్టమర్లకు మళ్లీ స్వాగతం పలకనున్నాయి. కస్టమర్లతో కళకళలాడాల్సిన రెస్టారెంట్లు సామాజిక దూరాన్ని పాటించడం కారణంగా డైనింగ్ కెపాసిటీ తగ్గిపోవచ్చు. కానీ, ఇంట్లో వండిన ఆహారంలా ఎంజాయ్ చేస్తూ తినడం కష్టమే. కానీ, బయట ఫుడ్ తినడం ఇష్టపడేవారిలో కూడా ఇలాంటి ఆలోచనే వచ్చే అవకాశం లేకపోలేదు.
34శాతం తగ్గిన ఫుడ్ వేస్ట్:
కరోనాతో చాలామంది తరచూ షాపింగ్ చేసేందుకు ఇష్టపడటం లేదు. ముందుగానే తెచ్చుకున్న ఫుడ్ ను ఫ్రిజ్ ల్లో పెట్టేస్తున్నారు. అవసరమైనప్పుడు అదే వాడేస్తున్నారు. పొదుపుగా వాడుతూ ఆహారాన్ని వేస్ట్ చేయడం తగ్గించారు. WRAP సర్వే ప్రకారం.. బంగాళదుంపలు, బ్రెడ్, చికెన్, పాలను ఇంట్లో వృధా చేయడం 34శాతం వరకు తగ్గినట్టు రిపోర్టు తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తినే పదార్థాలను వృధా చేయకుండా ఆదా చేస్తున్నారు.. ఇంట్లో ఉన్న ఆహారాన్ని పొదుపుగా క్రియేటీవ్‌గా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ జీవితంలోకి వచ్చాక ఫుడ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియనప్పటికీ చాలా విషయాల్లో మార్పులు తధ్యమే.
Read: ఈ 5 లక్షణాలు ఉన్నాయా? మీ ఎమోషనల్ హెల్త్ ప్రమాదంలో ఉన్నట్టే!