Pahalgam terror attack: పాక్ ఆర్మీ చీఫ్ పరార్..? కుటుంబంతోపాటు దేశం నుంచి జంప్.. భారత్ దెబ్బకు వణికిపోతున్న పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్థాన్ లో కలకలం రేపుతున్నాయి.

Pahalgam terror attack: పాక్ ఆర్మీ చీఫ్ పరార్..? కుటుంబంతోపాటు దేశం నుంచి జంప్.. భారత్ దెబ్బకు వణికిపోతున్న పాక్ ప్రభుత్వం

Pakistan Army Chief Asim Munir

Updated On : April 28, 2025 / 9:34 AM IST

Pahalgam terror attack: జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వద్ద పాకిస్థాన్ సైన్యం భారత దేశాన్ని రెచ్చగొట్టే ధోరణిని అవలంభిస్తుంది. సోమవారం ఉదయం కప్వారా, ఫూంఛ్ జిల్లాల సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపించింది. వేగంగా స్పందించిన భారత్ ఆర్మీ వారికి ధీటైన సమాధానం ఇచ్చింది. పాక్, ఇండియా దేశాల మధ్య పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశం విడిచి పారిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల తన కుటుంబాన్ని దేశం దాటించిన పాక్ ఆర్మీ చీఫ్.. ప్రస్తుతం ఆయన కూడా దేశం నుంచి పారిపోయినట్లు పాక్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Adil Hussain: ‘లొంగిపోరా.. కనీసం మేమన్నా ప్రశాంతంగా బతుకుతాం’..- ఉగ్రదాడి కేసులో ప్రధాన అనుమానితుడి తల్లి తీవ్ర ఆవేదన..

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్థాన్ లో కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాకిస్థాన్ కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవల మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత రెండు రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని గుర్తించిన భారత్ ఆ దేశంపై ఆగ్రహంతో ఉంది. దీంతో ఎప్పుడైనా భారత్ సైన్యం పాకిస్థాన్ పై విరుచుకుపడొచ్చునని ఆ దేశం వణికిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ మునీరు దేశం నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, మరికొందరు మాత్రం.. రావల్పిండి బంకర్లో మునీరు తలదాచుకున్నాడని చెబుతున్నారు.

Pahalgam Attack: ఇండియాతో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్థాన్‌లో ముందుల ఎమర్జెన్సీ.. ఎంత దారుణ పరిస్థితి వచ్చిందో చూడండి..

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతోపాటు.. పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతేకాక భారత్ లోని పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సైన్యం సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పాకిస్థాన్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ దేశం విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ పీఎంఓ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేసింది. ఆ ఫొటోలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తోపాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీరు కూడా ఉన్నారని తెలిపింది. అయితే, దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మున్నీర్ పాల్గొన్నట్లుగా వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయ పడింది.