తప్పు ఒప్పుకున్న WHO: భారత్‌లో కరోనావైరస్ సామాజిక వ్యాప్తిలేదు

తప్పు ఒప్పుకున్న WHO: భారత్‌లో కరోనావైరస్ సామాజిక వ్యాప్తిలేదు

Updated On : April 10, 2020 / 10:00 AM IST

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తప్పు అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితులపై దేశాల వారీగా రిపోర్టు ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ మూడో దశలో ఉందని.. అంటే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాపించే దశలో ఉందని ఇచ్చిన రిపోర్టులో తప్పు దొర్లిందని తెలిపింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్టులో ముందు వరుసలో చైనా, తర్వాత ఇండియా.. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్లో ఉన్నాయని చెప్పింది. భారత్ లో ఇప్పటి వరకూ నమోదైన 6వేల 412కేసుల్లో 199మంది చనిపోయారు. గడిచిన 24గంటల్లో 33మంది ప్రాణాలు కోల్పోయారు. 

WHO స్టేజ్ 3లో ఇండియా ఉందని రిపోర్టు ఇచ్చినప్పటికీ భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. ముందుస్తు జాగ్రత్త కోసం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. నిపుణుల సూచన మేరకు మార్చి 25నుంచి 21రోజుల లాక్ డౌన్ అమలు చేసింది. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. ‘మనం స్టేజ్ 3లో లేనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థే ఒప్పుకుందని’ చెప్పారు. (కరోనా సామాజిక దూరం : చెట్టుపై అడ్వకేట్ నివాసం)

దేశవ్యాప్తంగా ఉన్న 600జిల్లాల్లో 400జిల్లాలకు ఎటువంటి వైరస్ ప్రమాదం లేదు. 133 మాత్రమే కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారాయి. శుక్రవారంతో చైనాలో కరోనాను WHO గుర్తించి 100రోజులు కావొస్తుంది. భారత్ లోనూ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఒకరి నుంచి ఒకరికి వచ్చినవి కాకుండా కేవలం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారానే వైరస్ వచ్చిందని తేలింది. 

ఒక మనిషి నుంచి పదుల సంఖ్యలో వైరస్ వ్యాపిస్తే దానిని మూడో స్టేజిగా లెక్కిస్తారు. ఒక వేళ ఇండియా ఆ స్టేజిలో ఉందని అంటే దానిని మేం దాచిపెట్టం. ఇప్పటికీ 20 నుంచి 30శాతం కేసులు ఎలా వచ్చాయో మాకు కన్ఫర్మేషన్ లేదు అని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లా అగర్వాల్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ మందికి వైరస్ సోకితే 95వేల మంది ప్రాణాలు కోల్పోయారు.