రెండోసారి LOCKDOWNపై స్పష్టత ఇచ్చిన WHO

రెండోసారి LOCKDOWNపై స్పష్టత ఇచ్చిన WHO

Updated On : April 6, 2020 / 11:47 AM IST

దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్‌డౌన్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రయల్ లాక్‌డౌన్‌‌గా మార్చి 22న జనతా కర్ఫ్యూను నిర్వహించారు. తొలి లాక్‌డౌన్‌‌ను ఏప్రిల్ 14వరకు నిర్వహించి, ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకూ సెకండ్ లాక్‌డౌన్‌‌ను కేంద్రం నిర్వహించాలనకున్నట్లు world health organization పేరుతో ప్రచారం సాగుతోంది. 

ఈ వైరల్ కంటెంట్ WHO వరకూ వెళ్లడంతో స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో WHO పేరిట జరుగుతున్న ప్రచారమంతా.. ఫేక్. లాక్‌డౌన్‌పై ఎటువంటి ప్రొటోకాల్స్ విధించలేదంటూ ట్వీట్ చేస్తూ, మినిష్టరీ ఆఫ్ హెల్త్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఐక్యరాజ్యసమితి భారత శాఖను ట్యాగ్ చేసింది. 

ఈ లేటెస్ట్‌పోస్టుతో భారతదేశంలో సెకండ్ లాక్‌డౌన్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించలేదని తెలిపింది. ఇప్పటివరకు, భారతదేశవ్యాప్తంగా 4వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరణాలు 100ను దాటాయి.

Mam /sir

See Also  | కరోనా హాట్‌స్పాట్స్: 62 జిల్లాల్లోనే 80శాతం కరోనా కేసులు