Khaby Lame: US ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో సోషల్ మీడియా సంచలనం ఖాబీ లేమ్..! ఎవరీ ఖాబీ లేమ్, అసలేం జరిగింది..
ఈ ఇటాలియన్ పౌరుడికి టిక్‌టాక్‌లో 162 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Khaby Lame: ఖాబీ లేమ్. పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ వీడియోలకు కేరాఫ్ అడ్రస్. ఒక్క మాట కూడా మాట్లాడాడు. జస్ట్ హావభావాలతోనే నవ్వులు పూయించడంలో స్పెషలిస్ట్. ఈ సోషల్ మీడియా స్టార్ ను గత శుక్రవారం నెవాడాలో US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అదుపులోకి తీసుకున్నారని, హెండర్ సన్ డిటెన్షన్ సెంటర్ కు తరలించారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. నివేదికల ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడనే ఆరోపణలతో లేమ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, కానీ వాలంటరీ డిపార్చర్ జారీ చేసి అదే రోజున విడుదల చేశారని తెలుస్తోంది.
జూన్ 6న నెవాడాలోని లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనల కారణంతో ఇటలీ పౌరుడు సెరింజ్ ఖబానే లేమ్ (25) ను US ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదుపులోకి తీసుకుందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. లేమ్ ఏప్రిల్ 30న అమెరికాలోకి ప్రవేశించాడు. వీసా నిబంధనల గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. లేమ్‌కు జూన్ 6న వాలంటరీ డిపార్చర్ మంజూరు చేయబడింది.
లాస్ వెగాస్‌లో లేమ్‌ను అరెస్ట్ చేసి హెండర్సన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లు రాజకీయ కార్యకర్త బో లౌడాన్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. లేమ్‌ను అక్రమ విదేశీయుడిగా పేర్కొన్నారు. ”వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నాడు, పైగా పన్నులు ఎగవేశాడు. అతడి డిపోర్ట్ చేయడానికి నేను వ్యక్తిగతంగా చర్య తీసుకున్నాను” అని లౌడాన్ తన పోస్ట్‌లో తెలిపారు.
Also Read: చైనా కారణంగా పాకిస్తాన్ ప్రజలకు గాడిద కష్టాలు.. అసలు చైనాకు, పాక్ గాడిదలకు లింకేంటి..
ఎవరీ ఖాబీ లేమ్?
సెనెగల్‌లో జన్మించిన ఖాబీ లేమ్, కోవిడ్ మహమ్మారి సమయంలో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన వీడియోల ద్వారా ప్రపంచ ఖ్యాతిని పొందాడు. అందులో మాటలు ఉండవు. కేవలం రియాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఇటాలియన్ పౌరుడికి టిక్‌టాక్‌లో 162 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు ఫోర్బ్స్ 30 అండర్ 30 ఫార్చ్యూన్ 40 అండర్ 40 వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ నుండి కూడా గుర్తింపు పొందాడు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram