10 Year Girl In Gaza : కన్నీరు పెట్టిస్తున్న’గాజా‘ చిన్నారి : డాక్టర్ని అయి పేదలకు సేవచేయాలనుకున్నా.. నా కలలు నాశనం చేశారు..
'నేనింకా చిన్న పిల్లను, డాక్టర్ని అయి పేదలకు సేవ చేయాలనుకున్నా..నా కలల్ని ఛిదిమేసేరు. నా ఆశల్ని నాశనం చేశారు. మేము ముస్లిములమైనంత మాత్రాన వాళ్లకు ….ఇజ్రాయెల్ కు శత్రువులమయ్యామా? అని యుద్ధభూమిగా మారిన గాజాలో శిథిలాలను చూస్తూ 10 ఏళ్ల చిన్నారి ప్రశ్నలు కన్నీరు తెప్పిస్తున్నాయి..

This Says 10 Year Old Girl In Gaza City
This Says 10 Year Old Girl In Gaza City :ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం చిన్నారుల జీవితాలను చిదిమేస్తోంది. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది. భవిష్యత్తు మీద ఎన్నో కలలు పెట్టుకున్న బిడ్డల జీవితాలను అంతంచేస్తోంది. తమకు ఏం జరిగిందో ఎవరు ఎందుకు దాడులు చేస్తున్నారో తెలియక అమాయకంగా బలైపోతున్నారు. ఈ దాడుల్లో గాజా యుద్ధభూమిని తలపిస్తోంది. భవనాలు..ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాలను చూస్తు 10 ఏళ్ల చిన్నారి ఏడుస్తూ వేసిన ప్రశ్నలు కన్నీరు పెట్టిస్తున్నారు.
‘నేనింకా చిన్న పిల్లను, డాక్టర్ని అయి పేదలకు సేవ చేయాలనుకున్నా..నా కలల్ని ఛిదిమేసేరు. నా ఆశల్ని నాశనం చేశారు. మేము ముస్లిములమైనంత మాత్రాన వాళ్లకు ….ఇజ్రాయెల్ కు శత్రువులమయ్యామా? అని కల్లాకపటం తెలియని 10 ఏళ్ల చిన్నారి వేసిన ప్రశ్నలకు ఎవరు ఏం సమాధానం చెబుతారు? అసలు సమాధానం చెప్పే ధైర్యం ఎవరికన్నా ఉందా?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధంలో తన ఇల్లు కూలిపోగా…ఇంటిముందు నిలబడి ఇంటి శిథిలాలను చూస్తూ కన్నీరు పెడుతోంది. ఆ 10 ఏళ్ల బాలిక పేరు నదినె అబ్దేల్ తైఫ్. ఆ బాలిక తన ఇంటి ముందు కనిపిస్తున్న శిథిలాలను చూస్తూ కన్నీరు పెడుతున్న ఆవేదనతో ప్రశ్నిస్తున్న ఓ వీడియో అక్కడి దారుణానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఆ చిన్నారి..నాకు 10 ఏళ్లనీ..నేను డాక్టర్ని అయి తనవాళ్లకు, పేదలకు సేవలు చేయాలనుకున్నానని..కానీ నా ఆశలన్నీ ఆవిరయ్యాయని ఏడుస్తూ చెబుతోంది. విలపిస్తోంది.
మేం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని, ఈ దారుణ పరిస్థితిని భరించలేకపోతున్నానని కన్నీటితో చెప్పింది. మేము ముస్లిములమైనంత మాత్రాన వాళ్లకు ….ఇజ్రాయెల్ కు శత్రువులమయ్యామా? అని ప్రశ్నించింది. ఆల్ జజీరాకు చెందిన ఓ ప్రొడ్యూసర్ ఈ వీడియోను తన ట్విటర్ లో షేర్ చేయగానే ఈ వీడియోకు వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి.