Biden in Israel: ఆ లక్ష్యంతోనే ఇజ్రాయెల్ వచ్చిన బైడెన్.. అంతలోనే షాక్ ఇచ్చిన జోర్డాన్

గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది

Biden in Israel: ఆ లక్ష్యంతోనే ఇజ్రాయెల్ వచ్చిన బైడెన్.. అంతలోనే షాక్ ఇచ్చిన జోర్డాన్

Updated On : October 18, 2023 / 4:21 PM IST

Biden in Israel: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కసారిగా ఇజ్రయెల్‭లో ల్యాండ్ అయ్యారు. వచ్చీ రాగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఈ యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హమాస్ ప్రజలు మారణహోమానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. హమాస్ పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహించదని అంటూనే ఈ పోరాటం ఇజ్రాయెల్‌కు అంత సులభమేమీ కాదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఆయన ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అలాగే హమాస్ పూర్తి పాలస్తీనా బాధ్యత వహించదని బైడెన్ అన్నారు.

ఇరు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంలో బైడెన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ.. అమెరికా సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది మానవ నాగరికతకు, ఉగ్రవాదానికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడిని ఎయిర్‭పోర్టుకు వెళ్లి మరీ కౌగిలించుకుని స్వాగతం పలికారు నెతన్యాహూ. బైడెన్ పర్యటనలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారంపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Soumya Vishwanathan: 15 ఏళ్ల ఎదరుచూపుకు తెరదించుతూ జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. వాస్తవానికి ఈ దాడి ఇజ్రాయెల్ కు ప్రతికూలంగా మారనుంది. ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తున్నామని వాదించిన ఇజ్రాయెల్ కు దీంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా లాంటి దేశాల మద్దతు కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు ఆటంకంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో అరబ్ నేతల శిఖరాగ్ర సమావేశం రద్దైంది. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో అరబ్ నేతలతో ఆయన శిఖరాగ్ర సమావేశం నిర్వహించాల్సి ఉంది. వీటి మధ్య టెల్ అవీవ్ కు బైడెన్ చేరుకున్నారు. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారం కనుగొనే సామర్థ్యం బైడెన్ కు లేదని జోర్డాన్ రాజు అంతకు ముందు చెప్పారు.

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ఎదురుదాడిలో హమాస్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రపంచ దేశాల సానుభూతి గాజా ప్రజల వైపుకు మల్లొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని ముగించడానికి బైడెన్ ఒక మార్గాన్ని వెతుకుతున్నారు. దీని ద్వారా గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడం సహా హమాస్ బందీలను కూడా విడుదల చేయవచ్చు. ఒకవేళ ఇదే జరగకపోతే ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈ యుద్ధం ఇతర దేశాలకు విస్తరించి పెద్ద యుద్ధం సంభవించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని మోదీ విచారం.. దోషుల్ని విడిచిపెట్టొద్దంటూ హెచ్చరిక

బైడెన్ 50 ఏళ్లుగా ఇజ్రాయెల్‌ను సందర్శిస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా నెతన్యాహుకు తెలుసు. ఇద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ సంఘర్షణను ముగించడానికి బైడెన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో 80 ఏళ్ల అనుభవజ్ఞుడైన బైడెన్ ఏ వైఖరి తీసుకుంటాడో చూడాలి. గాజా ఆసుపత్రిలో పేలుడు 500 మందిని చంపిన తరువాత జో బైడెన్.. ఇజ్రాయెల్ పర్యటన మరింత కష్టతరంగా మారింది. ఈ సందర్శన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును జోర్డాన్‌లో అరబ్ దేశాల నాయకులను కలవాల్సి ఉంది. అయితే అమెరికా నుంచి బైడెన్ బయలుదేరే ముందే సమావేశాన్ని జోర్డాన్ రద్దు చేసింది. గాజాలోని ఆసుపత్రిపై దాడికి నిరసనగా ఇది జరిగింది.

అటువంటి పరిస్థితిలో బైడెన్ విశ్వసనీయతను ఇజ్రాయెల్ వైపుకు ఎక్కువగా మళ్లించడం మరింత సమస్యాత్మకం అవుతుండొచ్చు. ఎందుకంటే బైడెన్ రెండు వైపుల నిజాయితీగా రాజీ చేయగల ప్రపంచ నాయకుడిగా తనను తాను చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ జోర్డాన్ సమావేశం రద్దు కావడం బైడెన్‌కు ఇబ్బందికరమే. ఇది కాకుండా, మధ్యప్రాచ్య నాయకులు బైడెన్‌ను విశ్వసించడం లేదని ఈ ఘటనతో స్పష్టం అవుతోంది.

ఇది కూడా చదవండి: Union Cabinet: దీపావళికి ముందు కేంద్ర ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పి మోదీ ప్రభుత్వం