United Kingdom : టాటూలు వేయించుకుందని ఆమెకు టాయిలెట్ క్లీన్ చేసే జాబ్ కూడా ఇవ్వలేదట
టాటూలు ఇష్టమైతే ఏదో సరదాగా వేయించుకుంటారు. ముఖం కూడా గుర్తు పట్టలేనంతలా టాటూలు వేయించుకుంటే ఏమంటారు? యూకేలో ఓ మహిళ టాటూల పిచ్చి ఆమెకు ఒక్క ఉద్యోగం కూడా రాకుండా చేసింది.

United Kingdom
United Kingdom : టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఏదో సరదాగా వేయించుకోవడం కాదు.. వ్యసనంగా మారిపోయింది ఓ లేడీకి. ఒంటిమీద, ముఖం మీద కలిపి 800 టాటూలు వేయించేసుకుంది. ఇక అక్కడి నుంచి ఆమెకు సమస్య వచ్చిపడింది. ఏ ఉద్యోగంలోకి ఆమెను ఎవరూ తీసుకోలేదు సరికదా.. ఆఖరికి బాత్రూంలు క్లీన్ చేసే ఉద్యోగం కూడా ఇవ్వము పొమ్మన్నారు.. అందుకు కారణం అన్ని టాటూలు వేయించుకోవడమేనట.
Tamannaah : అభిమాని చేతిపై తమన్నా టాటూ.. ఎమోషనల్ అయిన తమన్నా..
యునైట్ కింగ్ డమ్ వేల్స్‌కు చెందిన మెలిస్సా స్లోన్ అనే 46 సంవత్సరాల మహిళకు టాటూలంటే వ్యసనంగా మారింది. శరీరంపై 800 టాటూలు వేయించుకున్న ఈ మహిళ వీటి కారణంగానే ఉద్యోగానికి అప్లై చేసిన ప్రతి చోట తిరస్కరణకు గురైంది. ముఖం, ఒంటిపై టాటూలతో ఉన్న ఆమెను చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వమన్నారు. చివరికి టాయిలెట్లు శుభ్రపరిచే ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే కూడా రిజక్ట్ అయ్యింది. స్లోన్ తన 20వ ఏట నుంచి పచ్చబొట్లు వేయించుకోవడం మొదలుపెట్టిందట. 70 ఏళ్ల వయసుకి వచ్చినా తాను ఇంకా పచ్చబొట్లు వేయించుకుంటానని చెబుతోంది.
Puneeth Rajkumar : పునీత్ పేరుని గుండెలపై టాటూగా.. మరో రెండు పేర్లు ఎవరివో తెలుసా?
టాటూల కారణంగా జీవనోపాధి లేకపోయినా వాటిని వేయించుకోవడం మాత్రం ఆపనని స్లోన్ చెప్పడం వింతగా అనిపిస్తోంది. టాటూల కారణంగా ఇప్పటికే ఆమె ముఖం నీలం రంగులోకి మారుతోందట. ప్రపంచంలోనే టాటూలు వేయించుకున్న వారిలో అత్యధిక టాటూలు వేయించుకున్నది తానే కావచ్చు అని స్లోన్ చెబుతోంది. జీవనోపాధి లేకపోయినా తాను టాటూలు వేయించుకోవడం ఆపనంటున్న ఆమెను చూస్తే ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్న మాట గుర్తొస్తోంది.