peanuts packs : విమానంలో పల్లీలు ఎవ్వరు తినకూడదట, అందుకే ఆమె అన్నీ కొనేసింది..
ఓ మహిళ విమానం ఎక్కగానే ఎవ్వరు పల్లీలు తినొద్దు అని చెప్పింది. విమాన సిబ్బందికి కూడా అదే విషయం చెప్పింది. తోటి ప్రయాణీకులు తినకూడదని మీరు ఎలా చెబుతారు..? ఇది సరికాదని చెప్పినందుకు ఆమె ఇప్పుడెలా తింటారో చూస్తాను అంటూ విమానంలో ఉన్న పల్లీ ప్యాకెట్లు అన్నీ కొనేసింది...

woman all peanuts packs purchase In flight
peanuts packs purchase In flight : ఆమె పేరు లియా విలియమ్స్ (Leah Williams). వయస్సు 27 ఏళ్లు. ఆమె జర్మనీ (Germany)లోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయం ( London Heathrow Airport)వరకూ ప్రయాణించేందుకు జులై 13న యూరోవింగ్స్‌కు చెందిన విమానం (Eurowings flight) ఎక్కింది. విమానం ఎక్కీ ఎక్కగానే ఆమె దయచేసిన విమానంలో ఎవ్వరు పల్లీలు తినవద్దు అంటూ ఎనౌన్స్ చేసింది. ఓ ప్యాసింజర్ అలా చెబితే మిగతవాళ్లు వింటారా ఏంటీ..? అదేంటీ ఆమె తినొద్దు అంటే మేం తినకుండా మానేయాలా..? అంటూ ఎవ్వరు పల్లీలు తినకుండా ఉండేందుకు అంగీకరించలేదు. దీంతో లియా ఏం చేసిందో తెలుసా…ఆమెకు అందుబాటులో ఉన్న పల్లీ ప్యాకెట్లు మొత్తం తానే కొనేసింది. మొత్తం 45 పల్లీల ప్యాకెట్స్ తానే కొనేసింది.
ఆమె ఎందుకిలా చేసిందంటే..ఆమెకు పల్లీల ఎలర్జీ ఉందట..దీంతో ఆమె పల్లీలు తినదు. అంతేకాదు ఆమె చుట్టుపక్కల ఎవరు తిన్నా ఆమెకు ఎలర్జీ వచ్చేస్తుందట. దీంతో ఆమె విమానం ఎక్కి అదే విషయం చెప్పింది. దీనికి తోటి ప్రయాణీకులు ఎవ్వరు అంగీకరించంకపోవటంతో ఆమెకు అందుబాటులో ఉన్న 48 పల్లీల ప్యాకెట్లు ఆమె కొనేసింది. ఎందుకంటే తోటి ప్రయాణీకులు కొని తింటే ఆమెకు ఇబ్బంది అవుతుందేమోనని..దీనికి సంబంధించి లియా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పంది. తానే కాదు ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని..అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ రిక్వెస్ట్ ను విమాన సిబ్బంది అంగీకరించలేదు. ఇది ఎయిర్‌లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు.
దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కొనేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన సమస్య గురించి క్యాబిన్ క్రూకు చెప్పానని కానీ వారు పట్టించుకోలేదని దీంతో తాను ఇబ్బంది పడకుండా తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని తెలిపింది. అంతేకాదు ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలి అంటూ పేర్కొన్నారు.
Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు