కోవిడ్-19 నియంత్రణలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న డ్రగ్.. ఇండియాలో ట్రయల్స్

నెలలుగా ప్రపంచం కరోనాపై యుద్ధం చేస్తుంది. ఇప్పటివరకు దీనికి సరైన మందు లేకపోవడంతో ప్రపంచం అంతా దీని గురించి భయాందోళనలు చెందుతుంది. COVID-19 ఆగిపోయే సంకేతాలు అయితే ఇప్పటివరకు కనిపించలేదు. ఇటువంటి పరిస్థితిలోనే మహమ్మారిపై పోరాటం కోసం మంచి పరిష్కారాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. COVID-19 రోగులకు వేగంగా కోలుకోవడానికి యాంటీవైరల్ ఔషధమైన “రెమ్‌డెసివిర్” బాగా సహాయపడుతుందని గుర్తించారు.
కరోనాపై పోరులో భాగంగా ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ గిలీడ్ సైన్సెస్‌కు చెందిన యాంటీ వైరల్ వ్యాక్సిన్ ‘రెమ్‌డెసివిర్’ను కొవిడ్-19 రోగుల అత్యవసర చికిత్సకు వినియోగించేందుకు అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఇప్పటికే అనమతి ఇవ్వగా.. దీంతో కరోనాతో బాధపడుతున్న పిల్లలు, యుక్త వయస్కుల అత్యవసర చికిత్సకు ‘రెమ్‌డెసివిర్’ను వాడే చాన్స్ లభిస్తుంది.
రెమ్‌డెసివిర్ ఔషధాన్ని తీసుకున్న రోగులు మిగతా ఔషధాలతో పోలిస్తే 31 శాతం వేగంగా అంటే సగటును నాలుగు రోజుల ముందే కోలుకుంటున్నట్టు చెబుతున్నారు వాస్తవానికి ఈ మెడిసిన్‌ని ఎబోలా నియంత్రణ కోసం దీనిని అభివద్ధి చేశారు. ముఖ్యంగా తక్కువ రక్త ఆక్సిజన్ స్థాయిలు లేదా శ్వాస కోస ఇబ్బందులు ఉన్నవాళ్లకు వెంటిలేటర్లపైనే ఆధారపడిన వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనంలో, ప్లేసిబోను సూచించిన వారి కంటే 31 శాతం వేగంగా రెమెడిసివిర్లో ఉంచిన వ్యక్తులు కోలుకున్నారని వెల్లడించింది. దీంతో భారతదేశంలో రెమ్‌డెసివిర్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రీమెడిసివిర్‌ని త్వరలోనే రోగులపై పరీక్షించనున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వెల్లడించారు.
సుమారు నాలుగు ఆసుపత్రులు ట్రయల్ సైట్లుగా గుర్తించబడ్డాయని డ్రగ్స్ వచ్చిన వెంటనే భారతదేశంలో ట్రయల్స్ ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.
Also Read | 30 రోజుల్లో కరోనాకు వ్యాక్సిన్…”సెప్సివాక్”పై ఆశాభావంగా CSIR