Malaria Vaccine : WHO ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్

ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకాకు (RTS, S/AS01) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. దోమ ద్వారా వచ్చే మలేరియా వ్యాధి.. ఏటా 4లక్షల కంటే ఎక్కువ మందిని చంపుతోంది. ''

Malaria Vaccine : WHO ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్

Malaria Vaccine

Malaria Vaccine : ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకాకు (RTS, S/AS01) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. దోమ ద్వారా వచ్చే మలేరియా వ్యాధి.. ఏటా 4లక్షల కంటే ఎక్కువ మందిని చంపుతోంది. ”ఈ రోజు, WHO ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ విస్తృత ఉపయోగాన్ని సిఫార్సు చేస్తోంది” అని ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు.

గ్లాక్సోస్మిత్‌క్లైన్ తయారు చేసిన ఈ టీకా, ఐదు మలేరియా వ్యాధికారకాల్లో అత్యంత ప్రాణాంతకమైన, ఆఫ్రికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌ని అడ్డుకోవడానికి పిల్లల రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ టీకా మలేరియాకు మొదటిది కాదు, పరాన్నజీవి వ్యాధికి ఇది మొదటిసారి అభివృద్ధి చేయబడింది.

క్లినికల్ ట్రయల్స్‌లో, మొదటి సంవత్సరంలో తీవ్రమైన మలేరియాకు వ్యతిరేకంగా ఈ టీకా దాదాపు 50 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ నాలుగో సంవత్సరం నాటికి సున్నాకి దగ్గరగా పడిపోయింది. మరణాలు నివారించడంలో వ్యాక్సిన్ ప్రభావాన్ని ట్రయల్స్ కొలవలేదు.

WHO Warning : ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

త్వరలోనే ఇది పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుందని తెలుస్తోంది. వచ్చే మూడేళ్లలో కనీసం 3 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ తయారీ, పరిశోధన, పరీక్షలు… అన్నింటికీ కలిపి మొత్తం 30 ఏళ్ల సమయం పట్టింది. మానవుల్లోని రోగ నిరోధక వ్యవస్థకు తగిన శిక్షణనిచ్చి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులపై పోరాడేందుకు ఈ టీకా దోహదం చేస్తుందని నిపుణులు తెలిపారు.

మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ను రెండేళ్ల వయసు వచ్చేలోపు నాలుగు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కనీసం 10మంది చిన్నారుల్లో నలుగురిలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్రమైన మలేరియా వ్యాధి కేసులు కూడా 1/3 వంతు తగ్గినట్లు వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని, మలేరియాను అరికట్టేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటికే వెల్లడైంది.

ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న మలేరియా వ్యాధి నిర్మూలనలో కచ్చితంగా ఈ టీకా పెను మార్పులను తీసుకురానుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి పైగా మలేరియా బారినపడి మరణిస్తున్నారు. వీరిలో చిన్నారులే అధికంగా ఉంటున్నారు.

Lion Fish : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోందని రిలీఫ్ అయ్యే లోపు వర్షాల వల్ల వచ్చే సీజనల్‌ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు జోరందుకుంటున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు కొవిడ్‌గా భావించే ప్రమాదం ఉంది. గతేడాది వర్షాకాలంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు భౌతిక దూరం పాటించడం వల్ల వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితుల నేపథ్యంలో జనసమ్మర్దం అధికంగా ఉండే చోట్ల విషజ్వరాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొవిడ్‌ను, సాధారణ విషజ్వరాలను వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ఈ విషయంలో డాక్టర్లతోపాటు ప్రజల్లోనూ అవగాహన పెరగాలని నిపుణులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల మందిని ప్రభావితం చేసే మలేరియా మన దేశంలో ప్రధానమైన ప్రజారోగ్య సమస్య. అటవీ, గిరిజన ప్రాంతాల్లో మలేరియా ప్రభావం అధికం. రెండు దశాబ్దాలుగా మలేరియా తాలూకు మరణాల శాతం తగ్గినా వ్యాధి బారిన పడుతున్న వారు అధికంగా ఉంటున్నారు. ప్రాణాంతకమైన ఫాల్సిపారం మలేరియా వయసుతో నిమిత్తం లేకుండా ప్రభావితం చేస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో, పారిశుద్ధ్య వ్యవస్థ లోపాల వల్ల పట్టణాలు, నగరాల్లో మలేరియా విజృంభిస్తోంది.

జులై నుంచి నవంబర్‌ మధ్య మన దేశంలో మలేరియా తీవ్రరూపం దాలుస్తుంది. మందులకు లొంగని మలేరియా కేసులు ఊపిరితిత్తుల సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్నాయి. తక్కువ మోతాదులో లేదా తక్కువ కాలం మాత్రమే మందులను వాడితే వ్యాధి తగ్గని పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి మలేరియాను 90శాతం తగ్గించే ప్రణాళికను చేపట్టింది. కేవలం మందులు వెదజల్లడం వంటి ప్రక్రియల ద్వారానే కాకుండా నూతన సమగ్ర విధానాల ద్వారా పరిసరాలు, వ్యక్తిగత పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మలేరియా ప్రభావిత దేశాలు గుర్తుచేశాయి.

మలేరియా ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి?
మలేరియా వ్యాధికి ప్రధాన కారణం ప్లాస్మోడియం పారాసైట్లు. దోమకాట్ల వల్లే ఇది ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన జ్వరం, వణుకు కారణంగా నీరసించిపోతారు. కాలేయం, రక్తంలోని ఎర్ర రక్త కణాలపైనా దాడి చేయడం ద్వారా రక్తహీనతకు ఈ పారసైట్ కారణమవుతుంది.

నివాస ప్రాంతాల్లో దోమల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. వీటితోపాటు ప్రభావవంతమైన మందులు అందుబాటులో ఉండటం కూడా మరణాలరేటులో తగ్గుదలకు కారణమైంది. మలేరియాను పూర్తిగా రూపమాపడం ప్రపంచం ముందున్న ఓ పెద్ద సవాల్. 2050నాటికి ఇది సాధ్యం కావచ్చని మలేరియా వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణుల, ఆర్థిక వేత్తలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 41మంది బృందం తమ నివేదికలో తెలిపింది.