ఆర్సీబీతో మ్యాచ్‌కు గేల్ వచ్చేస్తున్నాడోచ్!!

ఆర్సీబీతో మ్యాచ్‌కు గేల్ వచ్చేస్తున్నాడోచ్!!

Updated On : October 14, 2020 / 2:35 PM IST

Kings XI Punjabకు మరింత ఉత్సాహం వచ్చిపడ్డట్లయింది. IPL 2020 లో క్రిస్ గేల్ తో ఆడించేందుకు సర్వం సిద్ధం చేసింది. సీజన్ లో ఇన్ని రోజులుగా అట్టిపెట్టి ఉంచిన యూనివర్సల్ బాస్ వచ్చేస్తున్నాడు అంటూ ట్వీట్ చేసింది.

గురువారం Royal Challengers Bangaloreతో జరగనున్న తర్వాతి మ్యాచ్ లో Kings XI Punjab తరపున బరిలోకి దిగనున్నాడు. కడుపులో సమస్య ఉండటంతో గేల్ ప్రస్తుతం హాస్పిటల్ లో రెస్ట్ లోనే ఉన్నాడు.



పోరాడుతున్న Kings XI Punjab తరపున కరెక్ట్ టైంలో బరిలోకి దిగుతున్నాడు యూనివర్సల్ బాస్. అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మీరంతా సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది’ అంటూ ఓ వీడియో అప్ లోడ్ చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్.

ప్లే ఆఫ్ మ్యాచ్ ల కోసం ఆశపెట్టుకుంటున్న పంజాబ్ జట్టు ఎంత సక్సెస్ అవుతుందో మరి. గేల్ కూడా దాని గురించే మాట్లాడుతూ..’మీకు తెలుసా. అది సాధ్యం కావొచ్చు. మాకు తెలుసు మేం టేబుల్ చివర్లో ఉన్నాం. కానీ, ఇది సాధ్యమవుతుంది. ఇంకా ఏడు గేమ్స్ ఆడాల్సి ఉంది. మిగిలిన ఏడు మ్యాచ్ లు గెలుస్తామనే నమ్మకం ఉంది. ఇప్పటికీ అది సాధ్యమవుతుంది. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ వారిని నమ్మి ఆడాలి. గెలవడం ఒక్కటే లక్ష్యంగా ఆడాలి. మేం చేయగలం’ అని గేల్ చెప్పుకొచ్చాడు.

లైన్ అప్ లో ఉన్న గ్లెన్ మ్యాక్స్ వెల్ స్థానంలో గేల్ దిగనున్నాడు. ఏడు మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ చేసింది 58పరుగులు మాత్రమే. గేల్ రిటర్న్ కోసం అతను తప్పించారు. ‘అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. Royal Challengers Bangaloreతో జరిగే మ్యాచ్ లో అతను ఆడనున్నాడు’ అని జట్టు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.