IPL 2021 : నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై..

ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.

IPL 2021 : నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై..

Ipl 2021 4 Wickets Down In First Day Match

Updated On : April 9, 2021 / 9:00 PM IST

IPL 2021 : ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలుత రోహిత్ శర్మ (19) రనౌట్ కాగా.. ఆ తర్వాత క్రిస్ లెన్ (49), సూర్యకుమార్ యాదవ్ (31) పరుగులు చేశారు. క్రిస్టియన్‌ వేసిన ఓవర్‌లో 8 పరగులొచ్చాయి. హార్దిక్‌ పాండ్య(7) బౌండరీ బాదాడు. హార్దిక్ పాండ్యా (13) పటేల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.

లెన్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజారింది. 105 పరుగుల వద్ద ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ముంబై 16.2 ఓవర్లు ముగిసే సరికి 4వికెట్ల నష్టానికి 141 పరగులు చేసింది.


ఇషాన్ కిషన్ (26, నాటౌట్), పోలార్డ్ (0 నాటౌట్)గా క్రీజులో కొనసాగుతున్నారు. బెంగళూరు బౌలర్లలో కేల్, సుందర్, హార్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.