IPL 2021 : చెలరేగిన హర్షల్ పటేల్.. బెంగళూరు టార్గెట్ 160

ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

IPL 2021 : చెలరేగిన హర్షల్ పటేల్..  బెంగళూరు టార్గెట్ 160

Ys Sharmila Announces Party (2)

Updated On : April 9, 2021 / 9:44 PM IST

IPL 2021 : ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 160 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఓపెనర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (19) రనౌట్ గా తొలి వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత క్రిస్ లెన్ (49) దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువలో చేతులేత్తేశాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (31) వెనుదిరగగా.. ఇషాన్ కిషన్ (28) పటేల్ బౌలింగ్ లో ఎల్బీకి పెవిలియన్ చేరాడు. హార్దీక్ పాండ్యా (13) కూడా ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ముంబై ఆటగాళ్లలో పోలార్డ్ (7), కృనాల్ పాండ్యా (7), జాన్సెన్ (0), రాహుల్ చాహర్ (0), బుమ్రా (1 నాటౌట్) పరిమితమయ్యారు.

బెంగళూరు బౌలర్ల దెబ్బకు ముంబై ఆటగాళ్లు లెన్ మినహా అత్యధిక స్కోరు చేయలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో హార్షల్ పటేల్ 5 వికెట్లు తీసుకోగా.. సుందర్, కేల్ తలో వికెట్ తీసుకున్నారు.