AP DME 2026 Notification : నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.80,500 జీతం.. రాత పరీక్ష లేదు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి
AP DME 2026 Notification : నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ప్రారంభం నుంచే నెలకు రూ. రూ.80,500 జీతం పొందే అవకాశం. అస్సలు మిస్ చేసుకోకండి.
AP DME Recruitment 2026 notification for 284 Senior Resident Posts application process fee full details
AP DME 2026 Notification : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే.. నిజంగా బంపరాఫర్ అనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఇలాంటి ఛాన్సే లభించింది. రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య విభాగం పలు పోస్టుల భర్తీకి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఆయా పోస్టులకు సంబంధించి.. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి.. క్లినికల్ విభాగాలకు 44 ఏళ్లు, ఇతర విభాగాలకు 49 ఏళ్లకు మించకూడదని స్పష్టం చేశారు.
పైన పేర్కొన్న అర్హతలు కలిగిన వారు..
- మార్చి 25, 2026వ తేదీ నుంచి ఆసక్తిగల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- మార్చి 29, 2026వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
- ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.2000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అర్హులైన అభ్యర్థులు.. పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.
- స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
- ఎంపికైన వారికి నెలకు రూ.80,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
- ఎమర్జెన్సీ మెడిసిన్: 34
- బయోకెమిస్ట్రీ: 33
- పాథాలజీ: 32
- మైక్రోబయాలజీ: 30
- అనాటమీ: 29
- ఫార్మకాలజీ: 28
- కమ్యూనిటీ మెడిసిన్: 24
- ఫిజియాలజీ: 22
- ఫోరెన్సిక్ మెడిసిన్: 18
- రేడియేషన్ అంకాలజీ: 9
- జనరల్ సర్జరీ: 4
- రేడియో డయాగ్నోసిస్: 4
- అనెస్తీషియాలజీ: 3
- ఆర్థోపెడిక్స్: 2
- పీడియాట్రిక్స్: 2
- ఓబీజీ: 2
- డీవీఎల్ : 1
- సైకియాట్రి: 1
- ఈఎన్టీ : 1
- ఆప్తమాలజీ: 1
