SBI SCO Recruitment 2026 : బపంరాఫర్.. నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో SBIలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే.. అస్సలు మిస్ చేసుకోకండి..!
SBI SCO Recruitment 2026 : నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా జీతంతో.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
SBI SCO Lead Business Analyst Recruitment 2026 Notification Release for 8 posts details here
SBI SCO Recruitment 2026 : మీరు బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఏడాదికి రూ. 45 లక్షల వేతనం పొందే అవకాశం. పైగా రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కనుక ఈ అవకాశం అసలు మిస్ చేసుకోకండి. ఇంతకీ ఇవి ఏ ఉద్యోగాలు అంటే.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు. వీటి భర్తీకి సంబంధించి తాజాగా SBI నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా SBI దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో స్పెషలిస్ట్ కేడర్‌లో.. లీడ్ బిజినెస్ అనలిస్ట్ (Lead Business Analyst) ఆఫీసర్ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి ముందుకు వచ్చింది. మొత్తం 8 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 4వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ, ఎంటెక్/ ఎంఎస్సీ, ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
అనుభవం:
అలాగే సంబంధిత ఉద్యోగానుభవం కూడా ఉండాలి.
వయసు:
దరఖాస్తుదారుల వయోపరిమితి మార్చి 31, 2026 నాటికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం:
అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో మే 4, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్, డిఎక్స్ఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతం:
ఎంపికైన వారికి ఏడాదికి రూ. 45 లక్షల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి.
