YouTube channels: తప్పుడు వార్తల ప్రసారం.. యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

తప్పుడు సమాచారం అందించడంతోపాటు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వార్తలు ప్రసారం చేస్తున్నాయనే కారణంతో 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది.

YouTube channels: తప్పుడు వార్తల ప్రసారం.. యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

YouTube Channels Blocked

Updated On : April 25, 2022 / 8:20 PM IST

YouTube channels: తప్పుడు సమాచారం అందించడంతోపాటు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వార్తలు ప్రసారం చేస్తున్నాయనే కారణంతో 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. వీటిలో ఆరు ఛానెళ్లు పాకిస్తాన్‌కు చెందినవి కాగా, పది భారత్‌కు చెందినవి. వీటిలో ఒకటి ఫేస్‌బుక్ ఛానెల్. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఛానెళ్లు తప్పుడు అంశాల్ని, వార్తల్ని వీడియోల రూపంలో ప్రచారం చేస్తున్నాయి. వీటివల్ల సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

 

అందుకే దేశ భద్రత దృష్ట్యా వీటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ 16 ఛానెళ్లకు కలిపి 68 కోట్ల వ్యూయర్‌షిప్ ఉన్నట్లు కేంద్రం చెప్పింది. ఈ ఛానెళ్ల వివరాలను కూడా వెల్లడించింది. అయితే, ఇలా యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం నిషేధించడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల మొదటి వారంలో 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. వీటిలో కూడా కొన్ని పాక్ ఛానెళ్లు ఉన్నాయి. తప్పుడు వార్తలు ప్రసారం చేసినా, దేశ భధ్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించినా ఛానెళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.