Pak’s Balochistan Province: ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి!

పాకికిస్తాన్ లోని బలూచ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది వరకు గాయపడినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.

Pak’s Balochistan Province: ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి!

18 Killed In Bus Accident In Paks Balochistan Province

Updated On : June 11, 2021 / 12:24 PM IST

Pak’s Balochistan Province: పాకికిస్తాన్ లోని బలూచ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది వరకు గాయపడినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాధమిక దర్యాప్తులో తేలగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ప్రావిన్స్‌లోని పారా మిలటరీ దళాలు ఖుజ్దార్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

సింధ్‌ ప్రావిన్స్‌లోని లార్కానా జిల్లా నుంచి ఖుజ్దార్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోగా డీప్ కర్వ్ వద్ద బస్సు అతివేగంతో మలుపు తిప్పడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా.. ఘటనా స్థలంలోనే 15 మంది మృతి చెందగా.. ఆసుపత్రుల్లో ముగ్గురు మరణించారు. గత మూడు రోజుల క్రితమే ప్రావిన్స్‌లోనే రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 62 మంది మరణించగా ఈ వారంలోనే ఇలా మరో ప్రమాదంలో 18 మంది మరణించడం విచారకరం.