West Bengal Lightning Strikes: పశ్చిమబెంగాల్ లో పిడుగుపాటుకు ఏడుగురి మృతి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గురువారం పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలో పిడుగుపాటు వల్ల ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు....

West Bengal Lightning Strikes: పశ్చిమబెంగాల్ లో పిడుగుపాటుకు ఏడుగురి మృతి

West Bengal Lightning Strikes

Updated On : June 22, 2023 / 11:58 AM IST

West Bengal Lightning Strikes: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గురువారం పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలో పిడుగుపాటు వల్ల ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.(7 People Dead) మాల్దా జిల్లాలో చౌదరి, ఉమ్మే కుల్సూం, దేబోశ్రీ మండల్, సోమిట్ మండల్, నజరూల్, రోబిజాన్ బీబీ,ఈసా సర్కార్ లు మరణించారని మాల్దా జిల్లా మెజిస్ట్రేట్ నితిన్ సింఘానియా చెప్పారు.

China barbecue restaurant gas explosion: చైనా బార్బీక్యూ రెస్టారెంట్‌లో పేలుడు.. 31మంది మృతి

పిడుగులు పడటం వల్ల 9 పశువులు కూడా మరణించాయి. మాల్దా జిల్లాలోని బంగిటోలా ఉన్నత పాఠశాలలో పిడుగులు పడటంతో 12 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని బంగిటోలా రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిడుగుపాటు వల్ల మరణించిన కుటుంబాలకు ఆర్థికసాయం అందిసత్ామని మాల్దా జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రతి ఏటా పిడుగు పాటు వల్ల జనం మరణిస్తూనే ఉన్నారు.