Mizoram Stone Quarry Collapsed: మిజోరాం క్వారీ ప్రమాద ఘటనలో 8మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

మిజోరంలోని హంథియాల్ జిల్లా మౌదా గ్రామ పరిధిలోని క్వారీలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Mizoram Stone Quarry Collapsed: మిజోరాం క్వారీ ప్రమాద ఘటనలో 8మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Mizoram Stone Quarry Collapsed

Updated On : November 15, 2022 / 11:37 AM IST

Mizoram Stone Quarry Collapsed: మిజోరంలోని ఓ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ మిజోరాంలోని హ్నాథియాల్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఓ రాతి క్వారీ కూలిపోవటంతో అనేకమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నాయి. వీరిలో 8మంది మరణించగా, మరో నలుగురు ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. క్వారీ కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Amazon Lay Off: ఇక అమెజాన్ వంతు.. 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన అమెజాన్

మౌదర్ గ్రామంలోని క్వారీలో ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని హ్నాథియాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినీత్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాద సమయంలో 13 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఒక కార్మికుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు . 12మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది కార్మికుల మృతదేహాలను గుర్తించారు. మరో నలుగురు ఆచూకీ లభించాల్సి ఉంది.

11 RSS Workers To RI for Life : నారాయణన్ హత్య కేసులో 11 మంది RSS కార్యకర్తలకు జీవిత ఖైదు

సోమవారం మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మిజోరాం విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ అదనపు కార్యదర్శి లాల్‌హరియత్‌పుయా మాట్లాడుతూ.. గని కూలిన సమయంలో దాదాపు 15 మంది ఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వైద్య బృందం సంఘటనా స్థలంలో ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.