శివగామినే ఏడిపించిన బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ

శివగామినే ఏడిపించిన బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ

Ramya Krishna To Tears By Rekhas Dance Performance

Updated On : April 7, 2021 / 1:05 AM IST

Ramya krishna to tears by Rekhas dance performance  : ‌రమ్యకృష్ణ. అందం అభినయం కలబోసిన నటి. బాహుబలి సినిమి తరువాత రమ్యకృష్ణ అనేకంటే శివగామి పేరుతోనే ఆమె ఫేమస్ అయిపోయారు. తెలుగులో సినిమా ఇండస్ట్రీని తన అందాలతో ఓ ఊపు ఊపిన గ్లామ్ హీరోయిన్ గాను..అభినయంతో ఆకట్టుకునే నటనతోను..పొగరు క్యారక్టర్లకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోటీ పడి నటించిన నటిగానూ ఆమెకు ఆమే సాటి. అదిరిపోయే ఫాలోయింగ్ ఆమె సొంతం.

ఐరెన్ లెగ్ అనే నిందల నుంచి గోల్డెన్ లెగ్ అనే రేంజ్ కు రమ్యకృష్ణ ప్రస్థానంలో ఆమె చేసిన క్యారక్టర్ల గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఇప్పటికీ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది రమ్య సొంతం. బాహుబలిలో శివగామి పాత్రతో ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర లిఖించుకుంది ఈ సీనియర్ హీరోయిన్.

సెకండ్ ఎంట్రీతో కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో ఆకట్టుకునే పాత్రలతో దూసుకుపోతోందీ శివగామి. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రమ్మకృష్ణను కంట తడి పెట్టించింది బాలివుడ్ అలనాటి స్టార్ హీరోయిన రేఖ. రేఖ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందంలోను అభినయంలోను ఆమెకు ఆమే సాటి అంటే అతిశయోక్తి కాదు. శివగామి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రమ్యకృష్ణ ఇంతగా ఏడవడానికి కారణం బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ.

ఇండియన్ ఐడల్ సీజన్ 12కి రేఖ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అలా ఆమె రావడమే కాదు..కుండా ఏళ్ల వయస్సులో ఉన్నీ ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ స్టేజ్ పై డాన్స్ వేసారు. రేఖ క్లాసికల్ డాన్సర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. 66 ఏళ్ల వయసులో రేఖా జి డాన్స్ చూసి వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. ఇక టీవీలో ఈ డాన్స్ చూసి రమ్యకృష్ణ ఎమోషనల్ అయిపోయారు. రేఖ డ్యాన్స్ చూసి ఏడ్చేసారు. మై గాడ్.. మై గాడేస్.. రేఖా గారు అని క్యాప్షన్ పెట్టి రమ్యకృష్ణ ఒక వీడియో షేర్ చేసింది. రమ్యకృష్ణ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.